Updated : 21/08/2021 07:24 IST

Afghanistan: ఎండు పండ్ల ధరలకు రెక్కలు.. అఫ్గానిస్థాన్‌ ప్రభావంతో ఆగిన దిగుమతులు

 

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎండు పండ్ల ధరలపై అఫ్గానిస్థాన్‌ ప్రభావం పడనుంది. తాలిబన్ల వశమైన ఆ దేశం నుంచి ఎగుమతులను ప్రస్తుతానికి నిషేధించారు. మన దేశానికి వాల్‌నట్స్‌, అప్రికాట్‌, అంజీర్‌, పైన్‌నట్స్‌ ఈ దేశం నుంచి దిగుమతి అవుతాయి. దిగుమతుల బడ్జెట్‌ రూ.3,753 కోట్లలో ఎండు ఫలాల వాటానే రూ.2,389 కోట్లు ఉంటుంది. కరోనా సమయంలో ఎండు పండ్ల వినియోగం భారీగా పెరిగింది. దిగుమతులు ఆగిపోవడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రభావం ఇతర డ్రై ఫ్రూట్స్‌పైనా పడుతుందని టోకు వ్యాపారి రాజూభాయ్‌ చెప్పారు. బేగంబజార్‌లోని టోకు విపణిలో ఏప్రిల్‌లో నాణ్యమైన అంజీర్‌ ధర కిలో రూ.1350 ఉండగా, ప్రస్తుతం రూ.1400-1450 వరకు పలుకుతోంది. వాల్‌నట్స్‌ రూ.1400 ఉండగా.. ప్రస్తుతం రూ.1499 వరకూ ఉంది. అప్రికాట్‌ కిలో రూ.550 ఉండగా, ప్రస్తుతం రూ.750కి చేరింది. బాదం నాణ్యమైన రకం నెల క్రితం కిలో రూ.950 ఉండగా, ప్రస్తుతం రూ.1330కి విక్రయిస్తున్నారు. మిగతావీ కిలోకి రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగాయి.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని