Updated : 10/08/2021 09:02 IST

21 ఏళ్లుగా ప్రియురాలి కోసం నిరీక్షణ.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి 

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తన ప్రియురాలు ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎదురుచూస్తూ ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. ఇలా 21 ఏళ్లుగా అక్కడే నిరీక్షిస్తున్న ఘటన పుదుకోట్టైలో చోటుచేసుకుంది. జిల్లాలోని పొన్నమరావతి సమీపం మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్‌ (40) దాదాపు 21 ఏళ్ల క్రితం కుటుంబాన్ని పోషించేందుకు కోయంబత్తూర్‌కు వెళ్లి అక్కడున్న ఓ కిరాణా దుకాణంలో పనిచేశాడు. ఆ సమయంలో కేరళకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు కారులో వచ్చి బలవంతంగా యువతిని లాక్కెళ్లారు. ఎప్పటికైనా ఆమె తిరిగి వచ్చేస్తుందని నాగరాజన్‌ రోడ్డుపైనే ఉండేవాడు. ఈ క్రమంలో మతిస్థిమితం కాస్త తప్పింది. తర్వాత కొన్నిరోజులకు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న రాతిబండపై ఉండేవాడు. చిన్న గుడిసెలా ఏర్పాటు చేసుకున్నాడు. అతడికి తల్లి నాగాయి ఆహారం ఇచ్చి వెళ్తుంటుంది. ఎవరితోనూ మాట్లాడకుండా అక్కడే నిరీక్షిస్తున్న నాగరాజన్‌ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.  

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని