Aadhaar: పోస్టాఫీసుల్లోనూ ఆధార్‌ అనుసంధానం

రైతులు తమ ఫోన్‌ నంబర్లను ఆధార్‌తో తపాలా కార్యాలయాల్లోనూ అనుసంధానం చేసుకోవచ్చని హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన

Updated : 20 Nov 2021 08:47 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రైతులు తమ ఫోన్‌ నంబర్లను ఆధార్‌తో తపాలా కార్యాలయాల్లోనూ అనుసంధానం చేసుకోవచ్చని హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల తపాలాశాఖ కార్యాలయాల్లో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. పలు కేంద్రాల్లో గ్రామీణ పోస్టుమాస్టర్లు కల్లాల్లో రైతుల వద్దకే వెళ్లి చేయిస్తున్నారని.., రూ.50 చెల్లించి ఆధార్‌తో ఫోన్‌ నంబరును అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు