Published : 30/11/2021 06:57 IST

జబల్‌పుర్‌లో బోట్స్‌వానా మహిళ ఆచూకీ కోసం అధికారుల హైరానా

జబల్‌పుర్‌: కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపించిన ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారిపై గట్టి నిఘా, పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలో బోట్స్‌వానాకు చెందిన మహిళ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు వచ్చిందన్న సమాచారం రావడంతో స్థానిక అధికారులకు ఓ రోజంతా కునుకు కరవైంది. బోట్స్‌వానా ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల ఒరీమెట్సో లిన్‌ ఖుమో ప్రస్తుతం అధికారిక పర్యటనపై భారత్‌లో ఉంది. ఈనెల 18న దిల్లీ నుంచి జబల్‌పుర్‌లోని ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌కు వచ్చింది. కొవిడ్‌ ప్రొటోకాల్‌లో భాగంగా విదేశీయుల పర్యటన వివరాలను రాష్ట్రాలతో పంచుకుంటున్న కేంద్రం.. ఆమె పర్యటన సమాచారాన్ని రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అధికారులకు చేరవేసింది. అయితే ఆమె ఎవరు, ఏ పనిమీద వచ్చిందన్న వివరాలు చెప్పలేదు. అప్రమత్తమైన జబల్‌పుర్‌ అధికారులు ఆమె ఆచూకీ కోసం ఆదివారం వెతుకులాట ప్రారంభించారు. ఎట్టకేలకు సోమవారం స్థానిక ఆర్మీ కాలేజీలో ఆచూకీ గుర్తించారు. వెంటనే వెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ జరిగిన ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం చూసి అంతా స్థిమితపడ్డారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని