
AP News: తిరుమల ఘాట్‌రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
తిరుమల: తిరుమల రెండో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ పైనుంచి రహదారిపై భారీ బండరాయి పడింది. దీంతో రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. కొండచరియలు విరిగిపడిన సమయంలో ఈ మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన తితిదే సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలో కొండపైకి వెళ్లే వాహనాలను తాత్కాలికంగా నిలిపేశారు.
దీనికి ప్రత్యామ్నాయంగా లింక్ రోడ్డు నుంచి విడతల వారీగా కొండ మీదకి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొండ పైనుంచి కిందికి వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తితిదే వర్గాలు తెలిపాయి. రహదారిపై పడిన రాళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. కాసేపట్లో ఈ మార్గంలోనూ రాకపోకలకు అనుమతించే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.