Published : 10/08/2021 12:05 IST

TS News: డిక్కీలో శవం.. కారును దగ్ధం చేసిన దుండగులు

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన దుండగులు కారును దగ్ధం చేశారు. కాగా, కారు డిక్కీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌ కుమార్‌, సీఐ స్వామిగౌడ్‌, నర్సాపూర్‌ సీఐ లింగేశ్వర్‌రావు, నారాయణపేట సీఐ నాగార్జున గౌడ్‌ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కారు ఇంజిన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మెదక్‌ పట్టణంలోని ఓ సినిమా టాకీస్‌ యజమాని వాహనంగా దాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. విచారణ చేపట్టి నిందితులను పట్టుకుంటామని ఆయన వివరించారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని