
Anandaiah: రాజకీయ పార్టీ పెడతా: ఆనందయ్య
అనకాపల్లి, న్యూస్టుడే: త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని ఆయన సోమవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందయ్య విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని తెలిపారు. బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీ పెడతామన్నారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు తనవద్ద మందు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.