Updated : 19 May 2022 12:38 IST

Spyware Alert: ఈ యాప్‌లు మీ పాస్‌వర్డ్‌లు, డేటాను కొట్టేస్తాయ్‌.. జాగ్రత్త!

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో డేటా చౌర్యం, వ్యక్తిగత గోప్యతపై ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొత్త కొత్త స్పైవేర్‌, మాల్‌వేర్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మనకు తెలియకుండానే గ్యాడ్జెట్‌లోకి వచ్చి పడుతున్నాయి. తాజాగా ‘ఫేస్‌ స్టీలర్‌’గా పిలవబడే స్పైవేర్‌ సున్నితమైన డేటాను వేగంగా తస్కరిస్తున్నట్లు ‘ట్రెండ్‌ మైక్రో’ అనే నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్‌ సహా ప్రముఖ సామాజిక మాధ్యమాల పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఇతర సున్నితమైన డేటాను ఈ ‘ఫేస్‌ స్టీలర్‌’ దొంగిలిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఏడు ఆండ్రాయిడ్‌ యాప్‌లలో స్పైవేర్‌ను గుర్తించినట్లు తెలిపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన గూగుల్‌ ఈ ఏడు యాప్‌లను తన ప్లేస్టోర్‌ను తొలింగించింది. మీ మొబైల్‌లోనూ ఈ యాప్‌లుంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోండి. 

‘ఫేస్‌ స్టీలర్‌’ స్పైవేర్‌ను గుర్తించిన యాప్‌లివే..

* డైలీ ఫిట్‌నెస్‌ ఓఎల్‌ (Daily Fitness OL)

ఎంజాయ్‌ ఫొటో ఎడిటర్‌ (Enjoy Photo Editor)

పనోరమా కెమెరా (Panorama Camera)

* ఫొటో గేమింగ్‌ పజిల్ (Photo Gaming Puzzle )

స్వామ్‌ ఫొటో (Swarm Photo)

బిజినెస్‌ మెటా మెనేజర్‌ (Business Meta Manager)

క్రిప్టోమైనింగ్ ఫార్మ్ యువర్‌ ఓన్‌ కైన్‌ (Cryptomining Farm Your own Coin)

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts