ఈ ల్యాపీల రేంజ్‌... వేరే లెవల్‌!

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌) 2021 కాస్త మందకొడిగానే సాగుతోందని చెప్పాలి. మొదటి, రెండో రోజు ప్రదర్శనలో రోలింగ్‌ డిస్‌ప్లే ఫోన్లు, తర్వాతి తరం ప్రాసెసర్‌లు, ఎగిరే కార్లు, సూపర్‌ స్మార్ట్ మాస్కులు, గేమింగ్ కుర్చీలతో పాటు... 

Updated : 14 Jan 2021 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌) 2021 కాస్త మందకొడిగానే సాగుతోందని చెప్పాలి. మొదటి, రెండో రోజు ప్రదర్శనలో రోలింగ్‌ డిస్‌ప్లే ఫోన్లు, తర్వాతి తరం ప్రాసెసర్‌లు, ఎగిరే కార్లు, సూపర్‌ స్మార్ట్ మాస్కులు, గేమింగ్ కుర్చీలతో పాటు పలు స్మార్ట్ గృహోపకరణాలను ఆవిష్కరించారు. మూడో రోజు ప్రదర్శనలో ఎక్కువగా గేమర్స్‌కు ఉపయోగపడే ల్యాప్‌టాప్‌లు, మానిటర్స్‌, గ్రాఫిక్ కార్డ్స్‌ను తీసుకొచ్చారు. మరింకెదుకు ఆలస్యం..ఆ జాబితా ఏంటో చూద్దాం..


ఎల్‌జీ గేమింగ్ మానిటర్స్‌

ఎల్‌జీ అల్ట్రా సిరీస్‌లో గేమింగ్ మానిటర్స్‌ని విడుదల చేసింది. ఇందులో ఎల్‌జీ అల్ట్రాగేర్‌, అల్ట్రావైడ్, అల్ట్రాఫైన్‌ సిరీస్‌ మోడల్స్‌ ఉన్నాయి. గేమర్స్‌, డిజిటల్‌ ఆర్టిస్ట్‌లు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ కోసం వీటిని తయారుచేసినట్లు ఎల్‌జీ తెలిపింది. అల్ట్రాగేర్‌ 27జీపీ950 మోడల్‌లో 144హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 27-అంగుళాల 4కే అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇక అల్ట్రాగేర్‌ 32జీపీ850 మానిటర్‌లో 165హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 31.5-అంగుళాల క్యూహెచ్‌డీ నానో ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. అల్ట్రాగేర్‌ 34జీపీ950జీ మానిటర్‌లో 144హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 34-అంగుళాల క్యూహెచ్‌డీ నానో ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ మూడు మానిటర్లు నివిడా జీ-సింక్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక అల్ట్రావైడ్ మానిటర్‌లో 5కే2కే అల్ట్రావైడ్ రిజల్యూషన్‌తో 40-అంగుళాల కర్వ్‌డ్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. అల్ట్రాఫైన్‌లో 31.5-అంగుళాల 4కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 


ఆసుస్‌ డ్యూయల్‌ స్క్రీన్‌ ల్యాప్‌టాప్స్‌

రెండో రోజు ప్రదర్శనలో గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన ఆసుస్, మూడో రోజు జెన్‌బుక్‌ సిరీస్‌లో రెండు ల్యాప్‌టాప్‌లను ప్రదర్శించింది. జెన్‌బుక్‌ ప్రో డ్యూయో ఓఎల్‌ఈడీ, జెన్‌బుక్‌ డ్యూయో 14 పేరుతో వీటిని తీసకొచ్చారు. జెన్‌బుక్‌ ప్రో డ్యూయో ఓఎల్‌ఈడీ మోడల్‌లో 15.6-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లేతో పాటు కీ బోర్డు ముందు భాగంలో సెకండరీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇంటెల్ కొత్త ప్రాసెసర్‌, ఆర్‌టీఎక్స్‌ గ్రాఫిక్‌ ఉంది. ఇక డ్యూయో 14లో 11వ జనరేషన్‌ ఐ5 లేదా ఐ7 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. నివిడా ఎమ్‌ఎక్స్‌450 గ్రాఫిక్‌ కార్డ్‌ ఉంది. 2021 తొలి త్రైమాసికంలో ఇవి అందుబాటులోకి వస్తాయని ఆసుస్ తెలిపింది. 


డెల్ ఏలియన్‌వేర్‌ ల్యాప్‌టాప్స్‌ 

డెల్‌ కంపెనీ గేమర్స్‌ కోసం ఏలియన్‌వేర్‌ సిరీస్‌లో ఎమ్‌15, ఎమ్‌17 ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది. వీటిలో ఇంటెల్‌ 10వ జనరేషన్‌ ఐ7-10870హెచ్‌, ఐ9-10980హెచ్‌కే ప్రాసెసర్‌లను ఇస్తున్నారు. వీటిలో 32జీబీ ర్యామ్‌, 4టీబీ పీసీఐఈ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. ఇక ఎమ్‌17లో 360హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ నెల చివరి వారంలో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తారట. 


ఎమ్‌ఎస్‌ఐ ల్యాప్‌టాప్‌ 

ఎమ్‌ఎస్‌ఐ కూడా గేమర్స్‌ కోసం క్రియేటర్‌ 15 ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. నివిడా ఆర్‌టీఎక్స్‌ 3000 మొబైల్ గ్రాఫిక్‌ కార్డ్‌ని ఇస్తున్నారు. క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కి ఈ ల్యాప్‌టాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్‌ఎస్‌ఐ తెలిపింది. 100 శాతం అడోబ్‌ ఏజీబీతో 15.6-అంగుళాల 4కే డిస్‌ప్లే ఇస్తున్నారు. 

ఇవీ చదవండి..

సీఈఎస్‌ 2021: తొలి రోజు హైలెట్స్‌..

సీఈఎస్ హైలెట్స్‌: రోలింగ్ డిస్‌ప్లే..3డీ స్కానర్‌ 

CES 2021: శాంసంగ్‌ ప్రాసెసర్‌..గేమింగ్ ఛైర్‌

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts