11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లతో కూడిన ల్యాప్‌టాప్‌లు కొనేందుకు 5 కారణాలు (advt)

మన చుట్టూ ఉన్న ప్రపంచం అత్యంత వేగంగా పరిణామం చెందుతోంది. మన ముఖ్యమైన పనులను మరింత సామర్థ్యంతో, మరింత స్మార్ట్‌గా పూర్తి చేసేందుకు ఎక్కువ సాంకేతికత అవసరమయ్యేలా సవాళ్లు విసురుతోంది. ,....

Published : 27 Jun 2021 20:45 IST

మన చుట్టూ ఉన్న ప్రపంచం అత్యంత వేగంగా పరిణామం చెందుతోంది. మన ముఖ్యమైన పనులను మరింత సామర్థ్యంతో, మరింత స్మార్ట్‌గా పూర్తి చేసేందుకు ఎక్కువ సాంకేతికత అవసరమయ్యేలా సవాళ్లు విసురుతోంది. అందుకే ఈనాటి ప్రపంచంలో ఆధారపడ్డదగ్గ అత్యున్నత పనితీరు కలిగిన ల్యాప్‌టాప్‌ అవసరం ఏర్పడింది. మీరు ఉద్యోగి, విద్యార్థి లేదా నిత్యం కనెక్ట్‌ అయ్యేవారైనా ల్యాప్‌టాప్‌ అవసరం ఉంటుంది. మీ పనులను చక్కబెట్టేందుకు 11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు (11th Gen Intel® Core™ processors) కలిగిన లాప్‌టాప్‌లు ఎందుకు అవసరమో చెప్పేందుకు 5 కారణాలివే..

AIతో సులభంగా నేర్చుకోవడం, ఆడటం, పనులు చేయొచ్చు

11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు కలిగిన లాప్‌టాప్‌లో AI(artificial intelligence) ఆధారిత సామర్థ్యాలు ఉన్నాయి. వేగంగా, సులభంగా, ఎక్కువ పని చేసుకొనేందుకు ఇవి ఉపయోగపడతాయి. మసకగా కనిపించే చిత్రాలను క్రిస్ప్‌గా మార్చుకోవచ్చు. చిత్రాలపై అవసరంలేని వాటిని తొలగించుకోవచ్చు. కాన్ఫరెన్స్‌ కాల్స్‌లో ఇబ్బంది పెట్టే శబ్దాలను సెకన్ల వ్యవధిలో తగ్గించొచ్చు. ఇక ప్రతిరోజూ ఉపయోగించే మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, గూగుల్‌ క్రోమ్‌, జూమ్‌ వంటి అప్లికేషన్లు అత్యంత బాగా పనిచేస్తాయి. రెస్పాన్సివ్‌నెస్‌ వేగంగా ఉంటుంది.

సన్నని, తేలికపాటి ల్యాప్‌టాప్‌ల్లో తర్వాతి తరం గ్రాఫిక్స్‌

11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్ల వల్ల చూడచక్కని గ్రాఫిక్స్‌ను పొందొచ్చు. అవి Intel® Iris®, Xe graphicsతో సమ్మిళితమై అత్యంత శక్తిమంతంగా ఉంటాయి. AI(artificial intelligenceసహకారం వల్ల మీ సృజనాత్మక పనులను సులభంగా చేసుకోవచ్చు. ఆటలను, స్ట్రీమింగ్‌ టైటిళ్లను 1080p, 60 FPS లేదా ఒకేసారి నాలుగు 4కే హెచ్‌డీ రెజల్యూషన్‌ డిస్‌ప్లేలను నడుపుకోవచ్చు.

గరిష్ఠ స్థాయుల్లో తర్వాతి తరం కనెక్టివిటీ

మీరు నిజంగా తర్వాతి తరం కనెక్టివిటీ సౌకర్యాలను పొందాలనుకుంటే కచ్చితంగా 11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో కూడిన ల్యాప్‌టాపే తీసుకోవాలి. ఎందుకంటే ఒకే కేబుల్‌ కనెక్షన్స్‌ నుంచి ఇవి కాంతివేగం తరహాలో గిగాబిట్‌ వైఫై వేగాన్ని ఇస్తాయి. త్వరగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. వేగంగా డేటాను బదిలీ చేయొచ్చు. ఒకే కేబుల్‌తో ఎక్స్‌టర్నల్‌ మానిటర్లు, స్టోరేజీ పరికరాలను కనెక్ట్‌ చేసుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌లు, రియల్‌టైం గేములు, ఇంట్లోని ఏ గదిలోంచైనా లేటెస్ట్‌ సినిమాలు వీక్షించేందుకు తిరుగులేని వైఫై సౌకర్యం ఉపయోగపడుతుంది.

అల్ట్రా పోర్టబుల్‌ గేమింగ్‌ను ఆస్వాదించండి

మరీ సన్నని, తేలికపాటి ల్యాప్‌టాప్‌లో ఉత్సాహ భరితమైన గేమింగ్‌ను ఆస్వాదించగలరని మీరెప్పుడైనా ఊహించారా? 11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు కలిసిన ల్యాప్‌టాప్‌లతో అది సాధ్యమే. వర్చువల్‌ రియాలిటీ తరహా గేముల్ని నమ్మశక్యం కాని విజువల్స్‌తో మీరిప్పుడు ఆస్వాదించొచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్లు కోటానుకోట్ల రంగులను తెరపై చూపించగలవు. మీ గేమింగ్‌ సెషన్ల సమయం పెంచుకొని, మరిన్ని ఫ్రేమ్‌రేట్స్‌, ఫుల్‌ హెచ్‌డీలో ఎక్కువ డిమాండ్‌ ఉన్న ట్రిపుల్‌ ఏ టైటిల్స్‌ గేముల్ని ఆడొచ్చు.

సుదీర్ఘ కాలం ఇమ్మర్సివ్‌ అనుభూతి

11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు కలిగిన ల్యాప్‌టాప్స్‌ను మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా ఉపయోగించొచ్చు. ఇవి వేగంగా ఛార్జ్‌ అవ్వడమే కాకుండా బ్యాటరీ జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. ల్యాప్‌టాప్‌ ఉపయోగించే పరిస్థితులు, వైఫైని కనెక్ట్‌ చేసి, బ్రైట్‌ స్క్రీన్‌, మల్టీటాస్కింగ్‌తో మేం ప్రయోగాలు చేశాం.

మీరింకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? 11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో కూడిన సన్నని, తేలికపాటి లాప్‌టాప్‌లను ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం.

మీరింకా 11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్ల గురించి తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్‌ చేయండి.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని