Published : 21 Jan 2022 20:58 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా .. కొత్తగా 4,416 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,26,819కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

2.సీఎంని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. యువకుడి అరెస్టు

మానవబాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ రాధిక మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు తెలిపారు.

3.సమ్మె నోటీసు ఇస్తాం.. సమయం ఇవ్వండి!: పీఆర్సీ సాధన సమితి

పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉదయం ఎన్జీవో హోంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల మరోసారి భేటీ అయ్యారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమితి విషయంలో ఏవిధమైన వైఖరితో ఉండాలనే అంశంపై సమాలోచనలు జరిపారు.

4.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే?

భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 7న పాన్‌ ఇండియాగా విడుదల కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఏడాది మార్చి 18న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ రోజున కుదరని పక్షంలో ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని వెల్లడించింది.

5.విదేశీ ప్రయాణికులు.. ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండక్కర్లేదు!: కేంద్రం

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్​ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్​పోర్ట్​లో జరిపిన పరీక్షల్లో పాజిటివ్​​ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం​ తప్పనిసరి కాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు సాధారణ కొవిడ్​ ప్రోటోకాల్​ అనుసరిస్తే సరిపోతుందని పేర్కొంది.

6.మహేశ్‌తో బాలకృష్ణ.. నవ్వులు పంచడమే కాదు.. గుండెలూ పిండేశారు!

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తెలుగు సినీ స్టార్లతో బాలకృష్ణ చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ సీజన్‌ ఫినాలే ఎపిసోడ్‌కు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమోను ‘ఆహా’ విడుదల చేసింది. బాలకృష్ణ-మహేశ్‌ మధ్య సరదా సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి.

7.ఎస్‌బీఐ అలర్ట్‌.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State bank of India- SBI) వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎస్‌బీఐకి చెందిన ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు శనివారం (జనవరి 22) కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆ బ్యాంక్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

8.దేశ వ్యతిరేక కంటెంట్‌ వ్యాప్తి.. 35 యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రంవేటు

నకిలీ, భారత వ్యతిరేక కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 35 యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేసింది. రెండు వెబ్‌సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్, రెండు ట్విటర్‌ ఖాతాలు, ఓ ఫేస్‌బుక్ అకౌంట్‌పైనా కొరడా ఝులిపించింది. వాటిని వెంటనే బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ వెల్లడించింది.

9.రాహులూ..! ఇలా జరగాలంటే అదృష్టం ఉండాలయ్యా..

ఒక్కోసారి క్రికెట్‌లో చోటు చేసుకునే సంఘటనలు తమాషాగా ఉంటాయి. మైదానంలోని వారికి ముచ్చెమటలు పట్టించినా.. ప్రేక్షకులకు మాత్రం నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇలాంటిదే భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డేలో జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు శుభారంభమే దక్కింది. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (55), శిఖర్ ధావన్ (29) అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు.

10.కొనసాగుతున్న బిట్‌కాయిన్‌ పతనం.. 30వేల డాలర్ల డౌన్‌!

ప్రముఖ క్రిప్టోకరెన్సీల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఓ దశలో బిట్‌కాయిన్ విలువ 7 శాతానికి పైగా కుంగింది. దీంతో కాయిన్‌ విలువ 38,261 డాలర్ల వద్ద ఐదు నెలల కనిష్ఠానికి చేరింది. ఈథర్‌ విలువ 3,000 డాలర్లకు పడిపోయింది. గత ఏడాది నవంబరులో జీవనకాల గరిష్ఠానికి చేరుకున్న ఈ డిజిటల్‌ టోకెన్ల మొత్తం విలువ ఇప్పటి వరకు 1 ట్రిలియన్‌ డాలర్ల వరకు పతనమవడం గమనార్హం.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని