Updated : 10 Mar 2020 11:57 IST

కరోనా ఎఫెక్ట్‌: ఆ దేశం మొత్తం నిర్బంధంలో..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటలీలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) అంతకంతకూ విజృంభిస్తుండడంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అక్కడ ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో నిర్బంధం విధిస్తూ రెండు రోజుల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు దేశం మొత్తానికి వర్తింపజేశారు. మునుపటి ఆదేశాల్ని ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇటలీలో దాదాపు ఆరు కోట్లకు పైగా జనాభా స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ముఖ్యంగా యువత అన్ని సంబరాలకు దూరంగా ఉండాలని సూచించింది. అత్యవవరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది. ఇప్పటి వరకు ఇటలీలో 1,807 మంది కొత్తవారికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 9,712కు చేరింది. ఇక మరో 97 మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 463కు చేరింది. చనిపోయిన వారిలో చాలా మంది ఇతర జబ్బులతో బాధపడుతున్న వృద్ధులే ఉన్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. 

> ఇక చైనాలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం 17 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 3,136కు చేరింది. ఇక వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 80,750 దాటింది. ఇప్పటి వరకు 59,000 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. 

> ఇరాన్‌లో కరోనా వైరస్ వల్ల మరో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 237కు చేరింది. ఇక బాధితుల సంఖ్య 7,161ను తాకింది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం. 

> ఇతర దేశాల నుంచి వచ్చేవారంతా రెండు వారాల పాటు ప్రత్యేక కేంద్రాల్లో వైద్య పర్యవేక్షణలో ఉండాల్సిందేనని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు నెతన్యాహు సోమవారం ఓ ప్రకటన చేశారు.

> భారత్‌లో సోమవారం ఏడు కరోనా కేసులు నిర్ధారణ కావడంతో దేశంలో ఇంతవరకు మొత్తం 46 మంది దీని బారిన పడినట్లయింది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, జమ్మూ, పంజాబ్‌లలో ఒక్కొక్కటి, మహారాష్ట్రలో రెండు చొప్పున కేసులు సోమవారం బయటపడ్డాయి.

దేశం   బాధితుల సంఖ్య  మరణాల సంఖ్య
చైనా  80,754 3,136
దక్షిణ కొరియా 7,513   54
ఇరాన్‌    7161 237
ఇటలీ  9,172 463
అమెరికా    514  24
జపాన్‌    514 09
ఫ్రాన్స్‌  1,191 21
స్పెయిన్‌  1,024 28
హాంకాంగ్‌  115 03
యునైటెడ్‌ కింగ్‌డం   319 05 
భారత్‌  46 00
ప్రపంచవ్యాప్తంగా   112,727 4,009

                                                          


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని