Twitter: ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్నారా.. వారికిలా చెక్ చెప్పేయండి!
ట్విటర్‌లో విసుగుపుట్టింటే ట్వీట్లకు చెక్ పెట్టేందుకు ట్విటర్ కీలక సూచన చేసింది. ఇందుకోసం సదరు ఖాతాదారులను మ్యూట్ చేయమని సూచించింది. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌లో విసుగుపుట్టించే నోటిఫికేషన్లకు చెక్ పెట్టేందుకు సదరు యూజర్ లేదా గ్రూప్‌ను మ్యూట్ చేస్తాం. అలానే ట్విటర్‌లో కూడా మన ట్వీట్లకు కొద్దిమంది యూజర్స్ అదేపనిగా ఇబ్బందికర కామెంట్లు పెడుతుంటారు. అలాంటి ట్వీట్లను మన టైమ్‌లైన్ నుంచి తొలగించేందుకు ట్విటర్ కీలక సూచన చేసింది. ఇందుకోసం ట్విటర్‌లో ఉన్న మ్యూట్ ఆప్షన్ ఉపయోగించాలని ట్విటర్ సూచించింది. దీని సాయంతో యూజర్స్ సదరు ఖాతాదారులను బ్లాక్, అన్‌ఫాలో చేయకుండా వాటి ట్వీట్లను టైమ్‌లైన్ నుంచి తొలగించవచ్చని తెలిపింది. మరి ఈ మ్యూట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ట్వీట్ నుంచి మ్యూట్
* మీరు మ్యూట్ చేయాలనుకుంటున్న ట్వీట్‌కు కుడివైపున మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో మీకు మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు ఖాతాదారుడి ట్వీట్లు మీ టైమ్‌లైన్‌పై కనిపించవు.
ప్రొపైల్ నుంచి మ్యూట్
* మీరు మ్యూట్ చేయాలనుకుంటున్న యూజర్ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో మోర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మ్యూట్ అప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు సదరు యూజర్‌ను మ్యూట్ చేసినట్లు పాప్-అప్ మెసేజ్ కనిపిస్తుంది.
మరి అన్‌మ్యూట్ ఎలా?
* ఒకవేళ మీరు మ్యూట్ చేసిన యూజర్‌ను అన్‌మ్యూట్ చేయాలనుకుంటే సదరు యూజర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మోర్‌పై క్లిక్ చేస్తే అందులో అన్‌మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు యూజర్ అన్‌మ్యూట్ అవుతారు.
* అలానే మీరు ఒకరికన్నా ఎక్కువ మంది యూజర్స్‌ను మ్యూట్ చేశారనుకుందాం. వారిలో కొందరిని మీరు అన్‌మ్యూట్ చేద్దామనుకుంటున్నారు. ఇందుకోసం మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో సెట్టింట్స్ అండ్ ప్రైవసీపై క్లిక్ చేయాలి.
* తర్వాత ప్రైవసీ అండ్ సేఫ్టీ ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులో మ్యూట్ అండ్ బ్లాక్ అనే సెక్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీరు మ్యూటెడ్ అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు మ్యూట్ చేసిన ఖాతా జాబితా కనిపిస్తుంది. అందులోంచి మీరు ఎవరిని అన్‌మ్యూట్ చేయాలకుంటున్నారో వారి ఖాతాపై క్లిక్ చేస్తే సదరు ఖాతా అన్‌మ్యూట్ అవుతుంది.
ఈ ఫీచర్‌తో మీరు మ్యూట్ చేసిన వ్యక్తుల ట్వీట్లు మీ టైమ్‌లైన్‌పై కనిపించవు. గతంలో అయితే ఇలాంటి యూజర్స్‌ను బ్లాక్ లేదా అన్‌ఫాలో చేయడం మినహా ఇతర ఆప్షన్ ఉండేదికాదు. దీంతో మీరు ఏదైనా ఖాతాను బ్లాక్ లేదా అన్‌ఫాలో చేసినా వారికి తెలిసిపోయేది. కానీ మ్యూట్ ఫీచర్‌తో సదరు ఖాతాదారులు మిమ్మల్ని అనుసరిస్తున్నప్పటికీ మీరు వారిని మ్యూట్ చేసినట్లు తెలియదని ట్విటర్ పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత.. ‘ఏఐ’ ఏం చెప్పిందంటే..?
-
World News
Worlds Deepest Hotel: అత్యంత లోతులో హోటల్.. ప్రయాణం కూడా సాహసమే!
-
General News
ఆ నివేదిక ధ్వంసం చేస్తే కీలక ఆధారాలు మాయం: హైకోర్టుకు తెలిపిన రఘురామ న్యాయవాది
-
India News
Agni Prime: నిశీధిలో దూసుకెళ్లిన ‘అగ్ని’ జ్వాల.. ప్రైమ్ ప్రయోగం విజయవంతం
-
Politics News
Nara Lokesh - Yuvagalam: జగన్ పాలనలో న్యాయవాదులూ బాధితులే: నారా లోకేశ్
-
Movies News
Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మేఘా ఆకాశ్.. పొలిటీషియన్ తనయుడితో డేటింగ్?