Published : 14 Jul 2022 21:26 IST

Twitter సేవలకు అంతరాయం.. #Twitterdown హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్స్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూట్యూబ్‌ ఆగిపోయినా.. ఫేస్‌బుక్‌ నిలిచిపోయినా... వాట్సాప్‌ మొరాయించినా.. యూజర్లు వెతికేది ట్విటర్‌లోనే. తమ ఫోన్ సమస్యా? లేదంటే యాప్‌ సమస్యా? అని ఆరా తీయడానికి ట్విటర్‌నే ఆశ్రయిస్తారు. హ్యాష్‌ట్యాగ్‌తో తమ సమస్యను వివరించి దాన్ని ట్రెండ్‌ చేస్తారు. మరి ట్విటర్‌ సేవలకు అంతరాయం ఏర్పడితే..? సో వాట్‌..! ట్విటర్‌లోనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ చేస్తామంటున్నారు యూజర్లు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్విటర్‌ సేవలు కాసేపు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లకు ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. ట్విటర్‌ యాప్‌, వెబ్‌సైట్‌, ట్వీట్‌ డెక్‌లో సైతం ఇబ్బంది తలెత్తింది. కాసేపటి తర్వాత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో చాలా మంది యూజర్లు తమకు కలిగిన అసౌకర్యాన్ని తిరిగి అదే ట్విటర్‌ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌ చేయడంతో అది కాస్త పలు చోట్ల  ట్రెండింగ్‌లోకి వెళ్లింది. అయితే, దీనిపై కొందరు ఫన్నీగా స్పందించారు. పొరపాటున తన ఖాతాను ట్విటర్‌ సస్పెండ్‌ చేసిందేమో అనుకున్నానని ఓ యూజర్‌ పేర్కొనగా.. ట్విటర్‌ నిలిచిపోయిందన్న వార్తతో వాట్సాప్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సంబురాలు చేసుకుంటున్నారని మరో యూజర్‌ సరదా పోస్ట్‌ పెట్టాడు.  ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పలుమార్లు ట్విటర్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.




Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts