Viral: కాకులే కానీ.. తోడు దొంగలు..!

ఇద్దరు దొంగలు కలిసి పక్కా ప్లాన్‌తో వ్యక్తుల దృష్టి మరల్చి వారి సొమ్మును కాజేయడం చూసుంటాం. కానీ రెండు కాకులు కలిసి ఓ పిల్లి తెచ్చుకున్న ఆహారాన్ని                     

Published : 11 Jul 2021 23:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇద్దరు దొంగలు కలిసి పక్కా ప్లాన్‌తో వ్యక్తుల దృష్టి మరల్చి వారి సొమ్మును కాజేయడం చూసుంటాం. కానీ, రెండు కాకులు కలిసి ఓ పిల్లి తెచ్చుకున్న ఆహారాన్ని తస్కరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలో.. ఓ పిల్లి తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేందుకు సిద్ధమవుతుంటుంది. ఓ కాకి వచ్చి తన ముక్కుతో ఆ పిల్లి వెనక పొడిచి పారిపోయింది. ఆ కాకి కోసం పిల్లి పరిగెత్తడంతో మరో కాకి ముందు నుంచి వచ్చింది. ఆ పిల్లి తెచ్చుకున్న ఆహారాన్ని నోట కరుచుకొని తుర్రుమంది. అంతే.. షాక్‌ అవడం పిల్లి వంతైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని