Updated : 23 Jul 2021 14:38 IST

Joker Malware Virus: పంథా మార్చి.. ఏమార్చి.. యాప్‌లపై దాడి

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికతతో ఎంతటి ఉపయోగాలున్నాయో అదే స్థాయిలో నష్టాలున్నాయి. మనిషి అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త యాప్‌లు, వెబ్‌సైట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు యూజర్ డేటా లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వైరస్‌, మాల్‌వేర్‌లతో దాడి చేస్తున్నారు. అందుకే గూగుల్ వంటి దిగ్గజ సంస్థ ప్లేస్టోర్‌లోని యాప్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతోపాటు..భద్రత విషయంలో యాప్‌ డెవలపర్స్‌కి కీలక సూచనలు చేస్తుంటుంది. తాజాగా హ్యాకర్స్ జోకర్‌ వైరస్‌లో మార్పులు చేసి యూజర్‌ ఫోన్లలోని ఎస్సెమ్మెస్‌లు, కాంటాక్ట్ లిస్ట్‌లు లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు గుర్తించామని జెడ్‌స్కేలర్ అనే క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. అలానే యూజర్‌ ప్రమేయం లేకుండా వారి డబ్ల్యూఏపీ (వైర్‌లెస్ అప్లికేషన్ ప్రొటోకాల్‌)లోకి ప్రవేశిస్తున్నారని వెల్లడించింది. దీనిపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. కోడింగ్, ఎగ్జిక్యూషన్ మెథడ్స్‌, పేలోడ్ రిట్రైవింగ్ టెక్నిక్‌లతో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతిలో దాడి చేస్తున్నారని జెడ్‌స్కేలర్ పేర్కొంది.

వైరస్ ఎలా వస్తుంది

దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీమ్‌కి సమాచారం అందించామని జెడ్‌స్కేలర్ తెలిపింది. కొత్త జోకర్ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టేందుకు హ్యాకర్స్‌ మూడు పద్ధతులను అనుసరిస్తున్నట్లు గుర్తించారు. మొదట యూఆర్‌ఎల్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ ద్వారా మాల్‌వేర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టడం. రెండోది ఒకటి లేదా అంతకుమించి స్టేగర్ పేలోడ్స్‌ను డౌన్‌లోడ్ చేసి యూఆర్‌ఎల్‌ల ఏఈఎస్‌ (అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్స్)లను ఏమార్చి డేటాను దొంగలించడం. చివరిగా డేటా ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్స్‌లోకి మాలేవేర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం. ఈ మూడు మార్గాల ద్వారా యూజర్ డేటాను దొంగలిస్తున్నారట. 

తప్పించుకోవడానికి ఏం చేయాలి

సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు యాంటీ వైరస్‌ సాప్ట్‌వేర్ ఉపయోగించడంతోపాటు కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేసేప్పుడు అనుమతులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ యూజర్‌ సమాచారాన్ని దొంగలిస్తున్న సుమారు 1800పైగా యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. అయినప్పటికీ హ్యాకర్స్ డేటా చౌర్యానికి కొత్త మార్గాలను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితం మాల్‌వేర్‌ను అప్‌డేట్ చేసి  కెమెరా, గేమింగ్, మెసేజింగ్, ఫొటో ఎడిటింగ్, ట్రాన్స్‌లేషన్, వాల్‌పేపర్ యాప్స్‌పై దాడి చేస్తున్నట్లు గుర్తించామని జిప్‌మెరియమ్‌ అనే సైబర్‌ సంస్థ వెల్లడించింది. 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని