
Vijay Deverakonda: ఆమిర్‌ఖాన్‌తో విజయ్ దేవరకొండ.. అందుకే కలిశారు!
ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు స్టార్ హీరోలు ఒకేచోట కనిపిస్తే చాలు సినీ అభిమానులు ఖుషీ అవుతారు. వీళ్లెందుకు కలిశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఆమిర్‌ఖాన్- విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫొటో ఇలాంటి ఆసక్తినే పెంచుతోంది. నెట్టింట వేల సంఖ్యలో లైక్స్ పొంది వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు ఇలా కలిసేందుకు కారణం బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్. ఈయన తన పుట్టినరోజు సందర్భంగా హిందీ తారలతోపాటు టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మిను ఆహ్వానించారు. ఈ సెలబ్రేషన్స్‌లో చోటు చేసుకున్న దృశ్యమే ఇది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఒక్కో ఫొటోను సోషల్ మీడియా వేదికగా ఛార్మి షేర్ చేస్తోంది. ప్రస్తుతానికి ఆమిర్, రణ్‌బీర్ కపూర్, రవీనా టాండన్, సోనాలి బింద్రేతో దిగిన స్టిల్‌ను పోస్ట్ చేసింది. సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్, మలైకా అరోరా, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, సైఫ్ అలీఖాన్- కరీనాకపూర్, రణ్‌వీర్‌సింగ్, హృతిక్‌రోషన్, అనన్య పాండే, సారా అలీఖాన్, జాన్వీకపూర్, టైగర్ ష్రాఫ్ తదితరులు కరణ్ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ‘లైగర్’ చిత్రానికి కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Gautham Raju: గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు: చిరంజీవి
-
India News
Rains: భారీ వర్షాలతో ముంబయికి ఆరెంజ్ అలర్ట్.. హిమాచల్‌లోనూ వరదలు
-
Business News
Cyber Insurance: సైబర్ బీమా.. ఆన్లైన్ లావాదేవీలకు ధీమా
-
Sports News
Ben Stokes : భారత్ 450 పరుగులు చేయాలని కోరుకున్నా: బెన్‌స్టోక్స్
-
Politics News
Eknath Shinde: ఆటో వేగానికి మెర్సిడెస్ వెనుకబడిపోయింది.. ఠాక్రేపై శిందే సెటైర్..!
-
Sports News
IND vs ENG: కట్టడి చేయలేకపోయారు.. కప్పు సాధించలేకపోయారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్‌ను నిలువరించిన వేళ..
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు