Updated : 17 Jun 2021 21:17 IST

WhatsApp: అదిరిపోయే ‘ఐదు’ అప్‌డేట్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుంది. యూజర్‌ ఫ్రెండ్లీ అయిన వాట్సాప్‌ కొంగొత్త అప్‌డేట్స్‌ను ఇవ్వడంలో ముందుంటుంది. ఇప్పటికే డిస్‌అప్పీరియంగ్‌ మెసేజ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌.. త్వరలో 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అయిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఆర్కైవ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌లోనూ మార్పులు చేసింది. ఈ క్రమంలో మరో ఐదు అప్‌డేట్‌లను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్ల ముందుకు వాట్సాప్‌ తీసుకురాబోతుంది. ఎప్పుడు విడుదల చేస్తామనేది ఇంకా వాట్సాప్‌ అధికారికంగా ప్రకటించలేదు. మరి వాట్సాప్‌ తీసుకురాబోయే ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం..

డిస్‌అప్పీయరింగ్‌ మోడ్‌.. వ్యూ వన్స్‌

* డిస్‌అప్పీయరింగ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌ను గతేడాది వాట్సాప్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 
* దీనిని డిస్‌అప్పీయరింగ్‌ మోడ్‌ పేరుతో మరింత అప్‌డేట్‌ చేయనుంది.  
* డిస్‌అప్పీయరింగ్ మోడ్‌ను ఆన్‌ చేసుకుంటే.. అన్ని వాట్సాప్‌ చాట్‌లకు ఒకేసారి డిస్‌అప్పీయరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ ఎనేబుల్‌ అవుతుంది. 
* అలానే వ్యూ వన్స్‌ ఆప్షన్‌ను తీసుకురాబోతుంది. ఈ ఆప్షన్‌ ద్వారా మీరు పంపే ఇమేజ్‌, వీడియోను కేవలం ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 
* ఉదాహరణకు మీరు ఓ ఫొటో కానీ వీడియోగానీ ఎవరికైనా పంపారనుకుందాం.. రిసీవర్‌ దానిని ఓపెన్‌ చేసి కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలరు. 
* ఫొటో లేదా వీడియో డిస్‌అప్పీయర్‌ అయ్యేలోపు స్క్రీన్‌షాట్‌ను తీసుకోవచ్చని వాట్సాప్‌ చెబుతోంది. అయితే ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటేనే పని చేస్తుంది.


రివ్యూ వాయిస్‌ మెసేజ్‌

* మనం వాట్సాప్‌లో టెక్ట్స్‌, ఇమేజ్‌, వీడియోలతోపాటు వాయిస్‌ రికార్డ్‌ చేసి పంపుతుంటాం. 
* వాయిస్‌ను రికార్డ్‌ చేసిన వెంటనే సెండ్‌ అయిపోతుంది. అందులో ఏదైనా పొరపాటు ఉంటే అవతలి యూజర్‌ వినేలోపు డిలీట్‌ చేసేయాలి. లేకపోతే అనర్థాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. 
* అలాంటప్పుడు రివ్యూ వాయిస్‌ మెసేజ్‌ ఆప్షన్‌ ఉండటం వల్ల రికార్డ్‌ చేసిన మెసేజ్‌ను సెండ్‌ చేసేలోపు వినే అవకాశం కలుగుతుంది. అప్పుడు విని ఓకే చేస్తే సెండ్‌ అవుతుంది.  * అలానే ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే వాయిస్‌ మెసేజెస్‌ను మరింత వేగంగా వినవచ్చని వాట్సాప్‌ చెబుతోంది. 


మల్టీ డివైజ్‌ సపోర్ట్‌

* యూజర్ల కోసం అతిపెద్ద అప్‌డేట్‌ను వాట్సాప్‌ తీసుకురాబోతోంది.  
* మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్‌లకు వాట్సాప్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. 
* మొయిన్‌ డివైజ్‌కు ఇంటర్నెట్‌ కనెక్టవిటీ లేకపోయినా మిగతావాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. 
* మరో రెండు నెలల్లో పబ్లిక్‌ బీటా వెర్షన్‌లో రానుంది. అనంతరం యూజర్లందరికి అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ పేర్కొంది. 
* ఈ ఫీచర్‌ ఐపాడ్‌లోనూ సపోర్ట్‌ ఇవ్వనుంది. 


న్యూ ఆర్కివ్‌

* వాట్సాప్‌ గ్రూప్‌ను కానీ, వ్యక్తిగత చాట్‌ను కానీ ఆర్కివ్‌ చేస్తే కిందికి వెళ్లిపోతుందని తెలుసు. 
* మళ్లీ ఏదైనా మెసేజ్‌ వస్తే కానీ ఆ గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌ మనకు కనిపిస్తుంది. 
* దీనికి అడ్వాన్డ్స్‌గా న్యూ ఆర్కివ్‌ ఫీచర్‌ తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 
* న్యూ ఆర్కివ్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే మెసేజ్‌ వచ్చినప్పటికీ పర్మినెంట్‌గా ఆర్కివ్‌డ్‌ను మ్యూట్‌ చేసేస్తుంది. 
* ఆర్కివ్‌డ్‌ మెసేజెస్‌ను  న్యూ ‘ఆర్కివ్‌డ్‌ చాట్‌’ సెక్షన్‌లో చూడొచ్చు.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని