Published : 04 Sep 2021 23:38 IST

Air Quality: లాక్‌డౌన్ కాలంలో వాతావరణంలో పెరిగిన గాలి నాణ్యత

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడినప్పటికీ పర్యావరణానికి మాత్రం మేలు జరిగిందని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం తెలిపింది. ప్రపంచ వాతావరణ సమాఖ్య విడుదల చేసిన  ‘వాతావరణంలో గాలి నాణ్యత’ నివేదికలో పలు అంశాలను ఐరాస పేర్కొంది. కరోనా కట్టడికి 2020లో ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్లు, ప్రయాణ ఆంక్షల కారణంగా వాయు కాలుష్యం భారీగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌, రవాణా ఆంక్షల సడలింపుల కారణంగా మళ్లీ వాయు కాలుష్యం నమోదవుతున్నట్లు  స్పష్టం చేసింది. వాయుకాలుష్యం పట్ల ప్రపంచ దేశాలు అవలంబించే ధోరణి మార్చుకోవాలని ఐరాస వాతావరణ విభాగం సూచించింది.


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని