Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చారు.

Updated : 28 Mar 2023 23:35 IST

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఓ తల్లి జన్మనిచ్చారు. జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలోని డాక్టర్ శంకర్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి శిశువులను విజయవంతంగా బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. గొట్టిముక్కులు లావణ్య, కిషన్ దంపతులకు తొలి కాన్పులో కొడుకు జన్మించగా మంగళవారం ఉదయం ఒకే సారి నలుగురు పిల్లలు పుట్టారు. ముగ్గురు మగ, ఒక ఆడ శిశువు జన్మించినట్టు ఆస్పత్రి యాజమాన్యం మీడియాకు వివరించింది. 8 నెలల గర్భంతో ఉన్న లావణ్య సోమవారం ఆసుపత్రికి రావడంతో అనారోగ్య సమస్యను గుర్తించి ప్రీ మెచ్యూర్ డెలివరి చేయాల్సి వచ్చిందని డాక్టర్ అఖిల వివరించారు. ఒక్కో శిశువు కిలోకు పైగా బరువు ఉన్నారని తల్లి బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. శిశువులను సిద్దిపేట ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు