Published : 16 Sep 2021 22:50 IST

YouTube: యూట్యూబ్‌లో కామెంట్స్‌.. ఇకపై నచ్చిన భాషలో..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూట్యూబ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌. ఇకపై యూట్యూబ్‌ కామెంట్స్‌ని సైతం ఇష్టమైన భాషల్లో ట్రాన్స్‌లేట్‌ చేసుకునే సరికొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది యూట్యూబ్‌. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్స్‌లో యూట్యూబ్‌ వినియోగిస్తున్న వారంతా దీన్ని ఉపయోగించవచ్చని వెల్లడించింది. ఈ ఫీచర్‌ ద్వారా సుమారు వందకు పైగా భాషల్లోకి కామెంట్లను అనువాదం చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. అందులో స్పానిష్‌, పోర్చగీస్‌, డచ్‌, ఫ్రెంచ్‌ తదితర భాషలు ఉన్నాయి. ఏ భాషలో కామెంట్‌ను చదవాలనుకుంటున్నారో.. దానిపై బటన్‌ నొక్కితే ఆ భాషలోకి కామెంట్‌ అనువాదం అవుతుంది. లైక్, డిస్‌లైక్‌, రిప్లై ఆప్షన్స్ కింద ట్రాన్స్‌లేట్ బటన్‌ను ఉంటుంది. దీనిని క్లిక్‌ చేయగానే కామెంట్లు మీకు నచ్చిన భాషలోకి మారిపోతాయి. ఈ ఫీచర్‌ను యూట్యూబ్‌ ఇప్పటికే ప్రవేశపెట్టింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో యూట్యూబ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య 10 బిలియన్ల పైకి చేరుకోగా.. యూట్యూబ్‌ మ్యూజిక్‌, యూట్యూబ్‌ ప్రీమియమ్‌కు 50మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని