Updated : 29 Jan 2022 09:42 IST

Yuvraj Singh: వెస్టిండీస్‌ సిరీస్‌లకు ఆ నలుగురు అర్హులైన ఆటగాళ్లు: యువీ

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్దిరోజుల్లో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు యువ ఆటగాళ్లు దీపక్‌ హూడా, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎంపికవ్వడంపై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నలుగురు అర్హులైన ఆటగాళ్లని కొనియాడాడు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌ల్లో వారిని చూడటం ఆనందంగా ఉందని ట్వీట్‌ చేశాడు.

కాగా, కొంతకాలంగా జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న కుల్‌దీప్‌యాదవ్‌ గతేడాది శ్రీలంక పర్యటనకు ఎంపికైన సంగతి తెలిసిందే. అక్కడ ఫర్వాలేదనిపించగా.. తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యాడు. అలాగే ఈ సిరీస్‌లకు రవిబిష్ణోయ్‌ లాంటి మరో యువ మణికట్టు స్పిన్నర్‌ కూడా తొలిసారి భారత జట్టుకు ఎంపికవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే కుడిచేతి వాటం గల హిట్టింగ్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ హూడా సైతం వన్డేల్లో చోటు సంపాదించుకున్నాడు. అతడు ఆఫ్‌స్పిన్నర్‌గానూ తన సేవలు అందించగలడు.

మరోవైపు 2020-2021 ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ సైతం మళ్లీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. గతేడాది అతడు గాయపడటంతో టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆడలేకపోయాడు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనట్లే అనిపించినా చివరి నిమిషంలో కరోనా సోకడంతో అతడి స్థానాన్ని జయంత్‌ యాదవ్‌ భర్తీ చేశాడు. ఇప్పుడు మళ్లీ జట్టులో చోటు దక్కడంతో దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇక గతేడాది ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ సైతం ఎంపికయ్యాడు. ఇప్పటికే శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్లుగా ఉండటంతో రుతురాజ్‌కు తుదిజట్టులో ఏమేరకు అవకాశం లభిస్తుందో చూడాలి.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని