Medaram 2022: ఆతిథ్యానికి హరిత హోటళ్లు..

భక్తులకు హరిత హోటళ్లు, రెస్టారెంట్లు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. హనుమకొండ, ములుగు గట్టమ్మ, జంగాలపల్లి, లక్నవరం, రామప్ప, తాడ్వాయి, మేడారం, బొగతల్లోని రెస్టారెంట్లలో

Updated : 16 Feb 2022 12:20 IST

భక్తులకు హరిత హోటళ్లు, రెస్టారెంట్లు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. హనుమకొండ, ములుగు గట్టమ్మ, జంగాలపల్లి, లక్నవరం, రామప్ప, తాడ్వాయి, మేడారం, బొగతల్లోని రెస్టారెంట్లలో ఉత్తర, దక్షిణ భారత వంటకాలను అందిస్తున్నారు. ఆర్డర్లపైనా సిద్ధం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు స్థానిక వంటలను ఇష్టపడుతుండడంతో స్థానిక వంటవారిని నియమించారు. ఆదివాసీల ప్రత్యేక వంటలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. నిర్వాహకులు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తున్నారు.  

*  మేడారం, తాడ్వాయి, గట్టమ్మ హరిత హోటళ్ల వద్ద  గిరిజన నృత్యాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

*  కాటేజీలు ఇప్పటికే వీఐపీల కోసం బుకింగ్‌ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం వస్తుంటారు.  మేడారంలో భక్తుల కోసం 25 లగ్జరీ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు.

- ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని