Medaram 2022: గిరిజన వేడుక.. సాంకేతిక వేదిక
జాతరకు భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ
ఈనాడు, వరంగల్ :జాతరకు భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నిర్వాహకులు వేడుక జరుపుతున్నారు. అడవిలోనే అత్యాధునిక సాంకేతిక సాధనాలు సమకూరుతున్నాయి.
వెబ్సైట్
http://medaramjathara.com/ పేరుతో ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సలహాలు, సూచనలు చేసేందుకు, జాతర విశిష్టత, పోలీసు రక్షణ విభాగంలో ట్రాఫిక్ మార్గదర్శకాలు, సహాయ కేంద్రాలు, ఆర్టీసీ బస్సు సౌకర్యాలు, ఎత్తు బంగారం ధరలు, హెల్ప్‌లైన్ కేంద్రాలు తెలుసుకునేందుకు వెబ్సైట్ దోహదపడుతుంది. శాఖల వారీగా బడ్జెట్టు వివరాలను కూడా పొందుపరిచారు.
ప్రత్యేక యాప్
‘మేడారం జాతర గైడ్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. 10 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. తాగు నీటి వసతి స్థలాలు, జాతర రూట్ మ్యాప్, తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకునేందుకు, దర్శనం క్యూలైన్, పార్కింగ్ స్థలాలు, వ్యాక్సినేషన్ పాయింట్, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు, సమీప పర్యాటక ప్రదేశాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
క్యూఆర్‌కోడ్
తొలిసారి ఈ- హుండీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జాతరలో అనేక చోట్ల క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుంది. భక్తులు తమ సెల్ఫోన్లతో వాటిని స్కాన్ చేసి నగదు రహితంగా మొక్కులు చెల్లించవచ్చు.
సీసీ కెమెరాలు
గత జాతరలో 200 వరకు సీసీ కెమెరాలను అమర్చగా, ఈ సారి 300 వరకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది.
తెరల్లో దర్శనం
ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. గద్దెల దృశ్యాలతో పాటు, జంపన్నవాగు పరిసరాలను, గిరిజన మ్యూజియం వద్ద జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను తెరల్లో ప్రదర్శించడంతో అనేక చోట్ల నుంచి తిలకించే అవకాశం భక్తులకు దక్కింది.
ఆకాశం నుంచి చిత్రాలు
డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. చిత్రాలతో పాటు, నిఘా పెట్టనున్నారు.- గత జాతరలో హామ్ రేడియో, యాంపీ థియేటర్ లాంటి కొత్త సాంకేతికతలను కూడా పరిచయం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!