నితిన్‌ కోసం నిధి

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కింది నటి నిధి అగర్వాల్‌. ఆ చిత్రమిచ్చిన విజయోత్సాహంతో ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో

Updated : 17 Sep 2021 07:28 IST

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కింది నటి నిధి అగర్వాల్‌. ఆ చిత్రమిచ్చిన విజయోత్సాహంతో ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న ఆమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌ అందిపుచ్చుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నితిన్‌ కథానాయకుడిగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కృతిశెట్టి నాయిక. ఇప్పుడీ సినిమా కోసం మరో నాయికగా నిధిని ఖరారు చేసినట్లు సమాచారం. విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వరసాగర్‌ స్వరాలందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు