‘ఏక్‌ మినీ కథ’ నుంచి లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల

‘పేపర్‌ బాయ్‌’, ‘తను నేను’వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. ప్రస్తుతం ‘ఏక్‌ మినీ కథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రానికి కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 07 Dec 2022 21:56 IST

హైదరాబాద్‌: ‘పేపర్‌ బాయ్‌’, ‘తను నేను’వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. ప్రస్తుతం ‘ఏక్‌ మినీ కథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై  తెరకెక్కుతున్న చిత్రానికి కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థప్పర్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమాకి కథను అందించడం విశేషం. తాజాగా చిత్రానికి సంబంధించి ‘ఈ మాయలో’ అంటూ సాగే  వీడియో సాంగ్‌ని చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఈ పాటకి శ్రీజో సాహిత్యం అందించగా లిప్సిక, స్వీకార్ అగస్తిలు శ్రావ్యంగా ఆలపించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం సమకూర్చారు. సినిమాకి సంబంధించి  ఇప్పటికే విడుదలైన టీజర్‌ నవ్వులు పూయిస్తోంది. గోకుల్‌ భారతి సినిమాటోగ్రాఫర్‌ వ్యవహరిస్తుండగా సత్య.జి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. చిత్రంలో బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, శ్రద్ధాదాస్‌, హర్షవర్థన్‌, సుదర్శన్‌ ఇతర  పాత్రల్ల్లో  నటిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని