కన్నడలో పూర్తి కావచ్చిన ‘కేజీఎఫ్‌ 2’ డబ్బింగ్‌

ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆ ఇద్దరు చాలా ఫేమస్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కె.జి.ఎఫ్‌: ఛాప్టర్‌ 2’ని తెరకెక్కిస్తున్నారు.

Published : 25 Mar 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆ ఇద్దరు చాలా ఫేమస్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కె.జి.ఎఫ్‌: ఛాప్టర్‌ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జులై 16న తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్రబృందం శరవేగంగా పనిచేస్తోంది. సినిమా కన్నడ వెర్షన్‌ డబ్బింగ్‌ దాదాపుగా పూర్తియ్యందని సమాచారం. తాజాగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ డబ్బింగ్‌ స్టూడియోలో హీరో యశ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ట్వీటర్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోపై తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తూ..‘‘రాకీతో డబ్‌ చేయడం ఎల్లప్పుడూ రాకింగ్‌గానే ఉంటుంది’’అని పేర్కొన్నారు. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మిగతా భాషల డబ్బింగ్‌ పనులను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారు. ప్రశాంత్‌నీల్‌ - సంగీత దర్శకుడు రవి బ్రసూర్ కలిసి సినిమాకి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని ఫైనలైజ్‌ చేస్తున్నారని టాక్‌. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇందులో సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’. సినిమా షూటింగ్‌ని తిరిగి ఏప్రిల్‌ 20న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని