Rashmika: పెళ్లి ముచ్చట చెప్పేసింది!
‘హీ ఈజ్ సో క్యూట్...హీ ఈజ్ సో స్వీట్’’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబును పొగడ్తతో మంచేసి ప్రేమికురాలి కవ్వించింది రష్మిక మందన..
ఇంటర్నెట్ డెస్క్: ‘హీ ఈజ్ సో క్యూట్...హీ ఈజ్ సో స్వీట్’’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు ప్రేమికురాలిగా కవ్వించింది రష్మిక మందన. ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి హంగామా చేస్తోంది. గత ఏడాది ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా ఎంపికై యువప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది. తమిళంలో కార్తి సరసన ‘సుల్తాన్’ చిత్రంలో నటించి అక్కడి ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా పెళ్లిపై స్పందిస్తూ మనసులోని మాటను వెల్లడించింది. ‘‘నాకు తమిళ సంస్కృతి, సంప్రదాయం అంటే చాలా ఇష్టం. అక్కడి భోజనం, ఆహార పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఎప్పటికైనా తమిళవాసుల ఇంటి కోడలిని కావాలన్నదే నా కోరిక ’’ అంటూ మదిలోని మాటను వెల్లడించింది. రష్మిక గతంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ పెళ్లి ఎందుకో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా చేస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లోనూ నాయిక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ చిత్రంలో చేస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్