పెళ్లిరోజున భార్య గురించి పూరీ ఏమన్నారంటే..?

డైనమిక్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన సతీమణి లావణ్య పూరీకి సోషల్‌మీడియా వేదికగా ప్రేమ సందేశం పంపారు. శనివారంతో వీరి వివాహ బంధానికి 24 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరి ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అరుదైన ఫొటోల్ని ఫాలోవర్స్‌తో పంచుకున్నారు...

Published : 07 Sep 2020 01:08 IST

అరుదైన ఫొటోలు షేర్‌ చేస్తూ..

హైదరాబాద్‌: డైనమిక్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన సతీమణి లావణ్య పూరీకి సోషల్‌మీడియా వేదికగా ప్రేమ సందేశం పంపారు. శనివారంతో వీరి వివాహ బంధానికి 24 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరి ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అరుదైన ఫొటోల్ని ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ‘1996 సెప్టెంబరు 6.. ఇరవై నాలుగేళ్లు అయ్యింది. లవ్‌ యూ నాన్న’ అంటూ పూరీ ఆనందంగా ఉన్న ఎమోజీలు షేర్‌ చేశారు. ఇదే సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోల్ని లావణ్య పోస్ట్‌ చేస్తూ.. ‘పెళ్లిరోజు శుభాకాంక్షలు జగ్గు (పూరీ జగన్నాథ్‌). మన వైవాహిక జీవితం ఇలానే సంతోషంగా ఉండేలా ఆ దేవుడి ఎప్పుడూ ఆశీర్వదించాలి. నిన్ను ఎప్పుడూ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొన్నారు.

పూరీ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘ఫైటర్‌’ (పరిశీలనలో ఉంది) సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళంలోనూ రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్‌ లాక్‌డౌక్‌కు ముందే పూర్తయింది. మరోపక్క తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘జన గణ మన’ను పాన్‌ ఇండియా చిత్రంగా తీస్తానని ఇటీవల పూరీ చెప్పడం విశేషం. అయితే, ఈ సినిమాలో కథానాయకుడు ఎవరన్నదీ ఆయన స్పష్టం చేయలేదు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని