రాజశేఖర్‌ సందడి షురూ

ఇటీవల కాలంలో థ్రిల్లర్‌ చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు రాజశేఖర్‌. ఇప్పుడీ క్రమంలోనే ఆయన నుంచి రానున్న కొత్త సినిమా ‘శేఖర్‌’. మ్యాన్‌ విత్‌ ద స్కార్‌.. అనేది ఉపశీర్షిక. లలిత్‌

Updated : 12 Aug 2021 07:11 IST

ఇటీవల కాలంలో థ్రిల్లర్‌ చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు రాజశేఖర్‌. ఇప్పుడీ క్రమంలోనే ఆయన నుంచి రానున్న కొత్త సినిమా ‘శేఖర్‌’. మ్యాన్‌ విత్‌ ద స్కార్‌.. అనేది ఉపశీర్షిక. లలిత్‌ దర్శకుడు. ఎమ్‌.ఎల్‌.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అను సితార, ముస్కాన్‌ కుబ్‌ చాందిని కథానాయికలు. రెండో దశ కరోనా పరిస్థితులతో ఆగిన ఈ సినిమా చిత్రీకరణ.. బుధవారం నుంచి అరకులో ప్రారంభమైంది. ప్రస్తుతం రాజశేఖర్‌తో పాటు నాయిక అను, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రాజశేఖర్‌ నటిస్తున్న 91వ చిత్రమిది. విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఈ నెలాఖరు వరకు అరకులోనే చిత్రీకరణ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌తో 75శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. తర్వాత హైదరాబాద్‌లో ఐదు రోజులు చిత్రీకరణ జరిపి.. శ్రీశైలం లేదా నాగార్జున సాగర్‌లో వారం షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తాం’’ అన్నారు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని