Chiranjeevi: మెగాస్టార్‌ ఫాలోవర్స్ ఎంతమందంటే!

మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులకు మరింతగా చేరువయ్యారు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీటర్‌ను అనుసరించే వారి సంఖ్య పదిలక్షలకు చేరుకుంది.

Updated : 14 May 2021 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులకు మరింతగా చేరువయ్యారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆయన ట్విటర్‌ను అనుసరించే వారి సంఖ్య పది లక్షలకు చేరుకుంది. గతేడాది ఉగాది పండగ సందర్బంగా మార్చి 25న ట్విటర్‌ ఖాతా ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆయన ఫాలోవర్స్ సంఖ్య అమితంగా పెరిగింది. చిరంజీవి తన సినిమా సంగతులతో పాటు మిగతా విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంటారు.

ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా రామ్‌చరణ్‌ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్‌ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. ఇందులో సోను సూద్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘లాహే..లాహే...’అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ యూట్యాబ్‌లో 35 మిలియన్ల వ్యూస్‌ని దాటి దూసుకుపోతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ రీమేక్ చిత్రం చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని