Amitabh Bachchan: ఈ అమ్మాయితో డ్యాన్స్‌ చేస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి

బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్‌ బి అమితాబ్‌ వ్యాఖ్యాతగా వహించే ‘కౌన్‌బనేగా కరోడ్‌ పతి’ షో కేవలం క్విజ్‌ ప్రొగ్రామ్‌ మాత్రమే కాదు.. వినోదాన్ని అందించే విషయంలోనూ ముందే ఉంటుంది. తాజాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది

Published : 20 Oct 2021 01:16 IST

నటి కృతిసనన్‌తో బిగ్‌బి బాల్‌ రూమ్ డ్యాన్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్‌ బి అమితాబ్‌ వ్యాఖ్యాతగా వహించే ‘కౌన్‌బనేగా కరోడ్‌ పతి’ షో కేవలం క్విజ్‌ ప్రొగ్రామ్‌ మాత్రమే కాదు.. వినోదాన్ని అందించే విషయంలోనూ ముందే ఉంటుంది. తాజాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది అందాల భామ కృతి సనన్‌. తన తదుపరి చిత్రం ‘హమ్‌ దో హమారే దో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన కృతితో బిగ్‌బి బాల్‌ రూమ్ డ్యాన్స్‌ చేశారు. ఎర్రటి పొడవైన గౌన్ లో కృతి.. నల్లటి సూట్‌లో అమితాబ్ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ డ్యాన్స్‌ చేస్తున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘కృతి నీతో బాల్‌ రూమ్‌ డ్యాన్స్‌ చేస్తుంటే.. నా కాలేజీ రోజులు, కోల్‌కతాలో నేను గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి’ అంటూ వ్యాఖ్య చేశారు. బిగ్‌బి నటించడానికి కన్నా ముందు కోల్‌కతాలోని కంపెనీలో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవారట. ఆపై నైనిటాల్‌లోని షేర్‌వుడ్‌ కళాశాల, దిల్లీలోని కిరోరి మాల్‌ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఇటీవలే 79వ ఏటలోకి అడుగుపెట్టిన బిగ్‌బి.. హోస్ట్‌గానే కాకుండా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. రణ్‌బీర్‌-ఆలియా ‘బ్రహ్మాస్త్ర’లో గురు అరవింద్‌ కుమార్‌గా, క్రీడానేపథ్యంలో.. ఫుట్‌బాల్‌ ఆటగాడు విజయ్‌బర్సే జీవితం ఆధారంగా వస్తున్న ‘జుంథ్‌’తో పాటు ఓ హాలీవుడ్‌ చిత్రం ‘ది ఇంటర్న్‌’తో పాటు ‘గుడ్‌బై’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు