Katrina Kaif: బాయ్‌ఫ్రెండ్‌ని పొగడ్తలతో ముంచెత్తిన కత్రినా

బీటౌన్‌లో నటులు కత్రినాకైఫ్‌- విక్కీకౌశల్‌ ప్రేమలో ఉన్నారనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిస్తూనే ఉన్నాయి. తాజాగా విక్కీ కౌశల్‌ నటించిన  ‘సర్దార్‌ ఉద్దమ్‌’ శనివారం అమెజాన్‌ ఓటీటీ వేదికగా విడుదలైంది.

Published : 17 Oct 2021 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కత్రినాకైఫ్‌- విక్కీకౌశల్‌ ప్రేమలో ఉన్నారనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా విక్కీ కౌశల్‌ నటించిన  ‘సర్దార్‌ ఉద్దమ్‌’ అమెజాన్‌ ఓటీటీ వేదికగా విడుదలైంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌ విక్కీకౌశల్‌ని కత్రినా ప్రశంసలతో ముంచెత్తింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న స్టోరీలో ‘‘విక్కీ.. నువ్వు నమ్మకమైన వ్యక్తివి, ఒక స్టార్‌, స్వచ్ఛమైన ప్రతిభ నీలో ఉంది’’ అని చెప్పింది. ఆ చిత్ర దర్శకుడు సూజిత్‌ సిర్కార్‌ని ఉద్దేశిస్తూ..‘‘నీలో మంచి విజన్‌ ఉంది. అందుకే ఇంత అందమైన, ఆసక్తికరమైన చిత్రాన్ని తీయగలిగావ్‌’’ అని అభినందించింది. 

‘సర్దార్‌ ఉద్దమ్‌’ కథ విషయానికొస్తే.. స్వాత్రంత్ర్య సమరయోధుడి జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1919 జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటిదినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. వందల మంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ను ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్‌ సిర్కార్‌లు ‘సర్దార్‌ ఉద్దమ్‌’ తెరకెక్కించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని