Regina Cassandra: విస్కీ గ్లాస్‌తో రెజీనా.. నెటిజన్ల ట్రోల్స్‌

కేవలం సినిమాల వల్లే కాదు.. యాడ్స్‌ ద్వారానూ అర్జిస్తుంటారు సినీ నటులు. సందేశాత్మక లేదా ప్రజలకు ఉపయోగపడే ప్రచారాల్లో పాల్గొంటే సరేసరి! లేదంట విమర్శలు ఎదుర్కొక తప్పదు. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రెజీనా ఓ విస్కీబ్రాండ్‌ని ప్రమోట్‌ చేసింది.

Published : 23 Oct 2021 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కేవలం సినిమాల వల్లే కాదు.. ప్రకటన ద్వారానూ అర్జిస్తుంటారు సినీ నటులు. సందేశాత్మక లేదా ప్రజలకు ఉపయోగపడే ప్రచారాల్లో పాల్గొంటే సరేసరి! లేదంటే విమర్శలు ఎదుర్కోక తప్పదు. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రెజీనాకు అదే పరిస్థితి ఎదురైంది. ఓ విస్కీ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేయడంతో నెటిజన్ల నుంచి రెజీనా పెద్దఎత్తున ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది.

‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘జ్యో అచ్యుతానంద’, ‘అ!’, ‘రారా కృష్ణయ్య’, ‘ఎవరు’ చిత్రాల ద్వారా తెలుగులో గుర్తింపు పొందిన ఈ భామ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేతిలో విస్కీ గ్లాస్‌తో యాడ్‌ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘‘తొమిద్మేళ్ల వయసులో యాంకరింగ్‌ చేయడం ప్రారంభించాను. అలా కమర్షియల్‌ యాడ్స్‌, సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగాను. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రయాణం. దీన్ని నేను నా ఫేవరెట్‌ విస్కీతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నా’’ అంటూ ఫొటోకి క్యాప్షన్‌ని జత చేశారు. దీంతో సోషల్‌ మీడియాలో రెజీనాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘డబ్బుల కోసం మద్యం సేవించాలని ప్రచారం చేస్తారా?’ అంటూ ఓ నెటిజన్‌ రెజీనాను తప్పుబట్టారు. ‘ఇలాంటి యాడ్స్‌లో కనిపించి మీ అభిమానులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? డబ్బుకోసం ఇలాంటి వాటిలో నటిస్తారా?’ అంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ‘మీరు ఒక బాధ్యత గల సెలబ్రెటీ.. అలాంటి మీరు ఇలా చేస్తే ఎలా? అందుకే మిమల్ని అన్‌ఫాలో చేస్తున్నా’ అంటూ కొందరు ఫాలోవర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎవరో ఒకరు దీనిపై రిపోర్టు చేయకముందే ఈ పోస్ట్‌ని తీసేయండి’ అంటూ మరొకరు కామెంట్‌ పెట్టారు. కొన్ని నెలలగా టాలీవుడ్‌కు గ్యాప్‌ ఇచ్చిన రెజీనా.. కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది. రాబోయే కొరటాల శివ- చిరంజీవి చిత్రం ‘ఆచార్య’లో పాటలో గెస్ట్‌రోల్‌లో ప్రేక్షకులను పలకరించనుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని