విజయ్‌ సరసన కథానాయికగా పూజా హగ్డే

 ‘మాస్టర్‌’ హీరో విజయ్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘దళపతి 65’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేశారు.

Published : 24 Mar 2021 22:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్:   హీరో విజయ్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నారు.‘దళపతి 65’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన ట్వీటర్ వేదికగా ప్రకటించింది. సినిమా ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. పూజా హెగ్డే తొలుత తమిళంలో ‘ముగమూడి’ చిత్రంతోనే వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత ఇప్పడు విజయ్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. ‘దళపతి 65’కి సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్‌ పరమహంస వ్యవహరించనున్నారు. ఇంకా చిత్రంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి వార్త ధ్రువీకరించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది. అఖిల్‌ అక్కినేనితో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది జూన్‌, జులైలోనే విడుదల కానున్నాయి. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు