Valimai: ఓటీటీలో ‘వలిమై’రికార్డు

అజిత్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వలిమై’ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది.

Updated : 27 Mar 2022 10:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అజిత్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వలిమై’ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. గత నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన లభించింది. అయితే అజిత్‌, కార్తికేయ బైక్‌ స్టంట్స్‌ యాక్షన్‌ ప్రియులను అలరించాయి. ఈ నేపథ్యంలో ఈనెల 25న ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చింది. స్ట్రీమింగ్‌ మొదలైన 24 గంటల్లోనే 100 మిలియన్‌ స్ట్రీమింగ్‌ నిమిషాలతో ‘వలిమై’రికార్డు సృష్టించింది.  హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజిత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని