Cinemanews: నోట్ల రద్దు తర్వాత ఏం జరిగింది..?

2016 నవంబర్‌ 8న ఈ తేదీని భారతదేశ ప్రజలు అంత సులువుగా మర్చిపోలేరు. ఎందుకంటే.. అదే రోజున రూ.500, రూ.1000నోట్లను రద్దు చేస్తున్నట్లుగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో ఎడాపెడా డబ్బు సంపాదించిన చాలామంది అక్రమార్కులు నల్ల డబ్బును వైట్‌మనీగా మార్చుకునేందుకు మల్లగుల్లాలు పడ్డారు.

Updated : 29 Jun 2023 18:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2016 నవంబర్‌ 8న ఈ తేదీని భారతదేశ ప్రజలు అంత సులువుగా మర్చిపోలేరు. ఎందుకంటే.. అదే రోజున రూ.500, రూ.1000నోట్లను రద్దు చేస్తున్నట్లుగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో ఎడాపెడా డబ్బు సంపాదించిన చాలామంది అక్రమార్కులు నల్ల డబ్బును వైట్‌మనీగా మార్చుకునేందుకు మల్లగుల్లాలు పడ్డారు. కొంతమంది ఎక్కడ దొరికిపోతామోనని భయపడి ఏకంగా డబ్బు తగలబెట్టారు. ఈక్రమంలోనే బెంగళూరు నుంచి హైదరబాద్‌కు తరలిస్తున్న రూ.100కోట్ల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘100క్రోర్స్‌’. సినిమా టీజర్‌ను ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఆదివారం విడుదల చేశారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను విరాట్‌ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కించారు. రాహుల్‌, చేతన్‌, సమీర్‌, భద్రం, అమీ, సాక్షిచౌదరి, ఐశ్వర్య, ఇంటూరి వాసు, కీలకపాత్రలు పోషించారు. ఎస్‌ఎస్‌ స్టూడియోస్‌ అండ్‌ విజన్‌ సినిమాస్‌ పతాకంపై సాయికార్తీక్‌, నాగమ్‌ తిరుపతి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పాటలు: భాస్కర భట్ల. సంగీతం: సాయి కార్తీక్‌. సినిమాటోగ్రఫీ: చరణ్‌ మాదవనేని. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని