10th Class Diaries: చాందినీకి సారీ చెప్పే అవకాశం కావాలి: శ్రీరామ్‌

‘‘చాందినీని ఒక్కసారి కలిసి సారీ చెప్పే అవకాశం ఇవ్వు’’ అని అంటున్నారు నటుడు శ్రీరామ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. అవికాగోర్‌ కథానాయిక....

Published : 26 Jan 2022 15:12 IST

హైదరాబాద్‌: ‘‘చాందినీని ఒక్కసారి కలిసి సారీ చెప్పే అవకాశం ఇవ్వు’’ అని అంటున్నారు నటుడు శ్రీరామ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. అవికాగోర్‌ కథానాయిక. శివబాలాజీ, శ్రీనివాసరెడ్డి, భానుశ్రీ, హిమజ కీలకపాత్రలు పోషించారు. ‘గరుడవేగ’ అంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను బుధవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. పదో తరగతి స్నేహితుల రీయూనియన్‌, పాఠశాల ప్రేమ వంటి ఆసక్తికర కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘‘చాందినీ ఉండి ఉంటే ఇంకా బాగుండేదన్న ఫీలింగ్‌ మీ అందరిలో ఉంది కదా. అదే ఫీలింగ్‌ నాలో ఇరవై యేళ్లగా ఉంది’’ అని శ్రీరామ్‌ చెప్పే సంభాషణలు, ఆయన నటన మెప్పించేలా సాగాయి. ఫ్రెండ్స్‌ రీయూనియన్‌కు చాందినీ ఎందుకు దూరంగా ఉంది? అసలు ఆమెకు ఏమైంది? అనే ఆసక్తికర విషయాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని