పుష్కరకాలం పూర్తి చేసుకున్న రవితేజ ‘కిక్‌’

రవితేజ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కిక్‌’. యాక్షన్ కామెడీగా తెరపైకి వచ్చి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రంలో కథానాయికగా ఇలియానా నటించింది. వక్కంతం వంశీ కథ అందించగా అబ్బూరి రవి రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. మే 8, 2009లో విడుదులైన ఈ సినిమా నేటికి  పుష్కరకాలం పూర్తి చేసుకుంది.

Updated : 29 Jun 2023 15:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కిక్‌’.  ఇలియానా కథానాయిక. యాక్షన్ కామెడీగా తెరపైకి వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. వక్కంతం వంశీ కథ అందించగా అబ్బూరి రవి రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. మే 8, 2009లో విడుదులైన ఈ సినిమా నేటికి  పుష్కరకాలం పూర్తి చేసుకుంది. చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూర్చగా రసూల్ ఎల్లోర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇందులో కోట శ్రీనివాసరావు, కిక్‌ శ్యామ్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రావు రమేష్‌, అలీతో పాటు పలువురు హాస్యనటులు ఇందులో నవ్వులు పూయించారు.

సినిమా కథేంటంటే కళ్యాణ్ (రవితేజ) చదువుకున్న కుర్రాడు. మంచి తెలివైన వాడు. కానీ ఏ ఒక్క ఉద్యోగంలోనూ  కొద్ది రోజులు కూడా పనిచేయడు. తను చేసే ప్రతి పనిలోనూ కిక్ ఉండాలని కోరుకునే వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి నైనా (ఇలియానా) పరిచయం అవుతోంది. ఆ తర్వాత కల్యాణ్ చేసే పనులకి నైనా ఏం చేసింది. వారి మధ్య ప్రేమ సఫలమైందా, విఫలమైందానేది మిగతా కథ. 2009లో విడుదలైన తెలుగు సినిమాల్లో  ‘కిక్‌’ బాగా క్లిక్‌ అయ్యి బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే సాధించింది. చిత్రంలో ‘I Dont Want Love..’’, ‘మనసే తడిసేలా..’’, ‘గోరె గోరె..’’ అంటూ సాగే పాటలు యువతను మెప్పించాయి. ఈ సినిమాకి సీక్వెల్‌గా 2015లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనే రవితేజ కథానాయకుడిగా ‘కిక్‌ 2’తెరకెక్కింది. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్‌ నటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని