OTT Movies: సినీ ప్రియులారా సిద్ధం కండి.. ఒక్కరోజే 18 సినిమాలు/సిరీస్‌లు
OTT Movies: రేపు విడుదల కానున్న సరికొత్త సినిమాలు, సిరీస్‌లు ఏమిటంటే..?
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల కాలంలో సినిమా థియేటర్లలో పెద్ద సినిమాలేమీ విడుదల కాలేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీ వేదికగా కొత్త సినిమాలు, సిరీస్‌లు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సినీ ప్రేమికుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వారం వారం కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అలా, ఈవారం అందులోనూ కేవలం శుక్రవారం (మార్చి 17) ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు/సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు/సిరీస్‌లు ఏమిటంటే.!
పాఠాలు చెప్పే ‘సార్’..!
ధనుష్ (Dhanush) హీరోగా టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన చిత్రం ‘సార్’ (SIR). సంయుక్త కథానాయిక. ఇప్పటికే థియేటర్‌లో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ సినిమా శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉండనుంది. విద్యను అడ్డుపెట్టుకుని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోట్లు ఎలా సంపాదించుకుంటున్నారో తెలియజేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని చూపిస్తూ ‘సార్’ (SIR) చిత్రం తెరకెక్కింది. ప్రైవేటు కళాశాలలకు ఛాలెంజ్ విసురుతూ ఓ లెక్చరర్.. ప్రభుత్వ కళాశాల అభ్యున్నతికు ఎలా పాటుపడ్డాడు? అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటి? వంటి ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది.
రచయిత కూడా వచ్చేస్తున్నాడు..!
‘కలర్‌ఫొటో’ ఫేమ్ సుహాస్ (Suhas) కథానాయకుడిగా నటించిన రీసెంట్ చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan). షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకుడు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సినీ ప్రియుల హృదయాలను హత్తుకుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా జీ5 వేదికగా విడుదల కానుంది. ఓ యువ రచయితకు ఎదురైన సవాళ్లు.. వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
రేపు విడుదల కానున్న మరిన్ని సినిమాలు/సిరీస్‌లు..!
ఆహా
సత్తిగాడి రెండు ఎకరాలు - తెలుగు సినిమా
లాక్డ్ - తమిళ్ సిరీస్ (ఆహా తమిళ్)
నెట్‌ఫ్లిక్స్
సార్/వాతి - సినిమా
కాట్ అవుట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ - ఇంగ్లీష్/హిందీ (డాక్యుమెంటరీ)
కుత్తే - హిందీ సినిమా
ది మెజిషియన్స్ ఎలిఫెంట్ - ఇంగ్లీష్ సినిమా
నాయిస్ - మెక్సికన్ సినిమా
ఇన్ హిస్ షాడో - ఫ్రెంచ్ సినిమా
ఏజెంట్ ఎల్విస్ - ఇంగ్లీష్ సిరీస్ సీజన్ -1
స్కై హై : ది సిరీస్ - స్పానిష్ సిరీస్ సీజన్ -1
మ్యాస్ట్రో ఇన్ బ్లూ - గ్రీక్ సిరీస్ సీజన్ -1
డ్యాన్స్ 100 - ఇంగ్లీష్ రియాల్టీ సిరీస్
జీ 5
యామ్ ఐ నెక్స్ట్ - హిందీ సినిమా
ప్రైమ్ వీడియో
గంధదగుడి - కన్నడ సినిమా
డామ్ - ఇంగ్లీష్ సిరీస్ సీజన్-2
బ్లాక్ ఆడమ్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
సోనీలివ్
రాకెట్ బాయ్స్ - హిందీ సిరీస్ సీజన్ -2 (స్ట్రీమింగ్ అవుతోంది)
ది వేల్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
సన్ నెక్స్ట్
వన్స్ అపాన్ ఎ టైమ్ జమాలిగూడ - కన్నడ సినిమా
హాట్‌స్టార్
పాప్ కౌన్ - హిందీ సిరీస్ సీజన్ -1
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో.. ప్రత్యేక బెంచ్‌కు సుప్రీం ఓకే
-
Movies News
Sreeleela: నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిని: శ్రీలీల
-
World News
London: భారత ప్రభుత్వం ప్రతిచర్య.. లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు
-
Politics News
KTR vs Bandi sanjay: ఉగాది వేళ.. కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగం చూశారా!
-
Movies News
Guna Sekhar: సమంతను అలా ఎంపిక చేశా.. ఆ విషయంలో పరిధి దాటలేదు: గుణ శేఖర్
-
Crime News
TSPSC: నిందితుల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు.. 40మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు