18 Pages: నిఖిల్ క‌ళ్ల‌పై అనుప‌మ ఏం రాసిందో!

నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘18 పేజెస్‌’. సూర్య ప్ర‌తాప్‌ ప‌ల్నాటి ద‌ర్శ‌కుడు. నిఖిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం.

Updated : 01 Jun 2021 13:09 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘18 పేజెస్‌’. సూర్య ప్ర‌తాప్‌ ప‌ల్నాటి ద‌ర్శ‌కుడు. నిఖిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో నిఖిల్ క‌ళ్ల‌పై ఉన్న‌ కాగితంపై అనుప‌మ ఏదో రాస్తూ క‌నిపించి ఆస‌క్తిని పెంచుతోంది. ట్విట‌ర్ వేదిక‌గా ఈ ఫొటోని పంచుకుంటూ త‌న పాత్ర గురించి తెలియ‌జేసింది అనుప‌మ‌. ‘నా పేరు నందిని. నాకు ఫోన్‌లో అక్షరాలను టైప్ చెయ్యడం కంటే ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు.. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్‌ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం విశేషం. జీఏ2 పిక్చర్స్‌ ప‌తాకంపై బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని