18 Pages: నిఖిల్‌- అనుపమ లవ్‌స్టోరీ.. ఆకట్టుకునేలా గ్లింప్స్‌

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’. సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ బుధవారం విడుదలైంది.

Published : 07 Apr 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’. సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ బుధవారం విడుదలైంది. ‘‘నాకో అమ్మాయి ఎప్పుడూ ఓ విషయం చెప్తుండేది. ప్రేమించడానికి రీజన్‌ ఉండకూడదు. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్‌ ఉండకూడదు’’ అని నిఖిల్‌ చెప్పిన డైలాగ్‌తో వీడియో ప్రారంభమైంది. హృదయాన్ని హత్తుకునే మెలొడీతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియోలో.. అనుపమ ప్రతి విషయాన్ని ఓ పుస్తకంలో రాసుకుంటూ కనిపించగా.. నిఖిల్‌ దాన్ని చదువుతూ కనిపించాడు. మరి ఈ ఇద్దరిని కలిపిన పుస్తకంలోని ‘18 పేజెస్‌’లో ఏం ఉందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రముఖ దర్శకుడు కథ అందించిన ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ 2, సుకుమార్‌ రైటింగ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని