18 Pages: 18 పేజెస్‌తో ప్రేమలో పడిపోతారు

‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే చిత్రం ‘18పేజెస్‌’. ఇది మీకు షాకిస్తుంది. సర్‌ప్రైజ్‌ చేస్తుంది’’ అన్నారు కథానాయకుడు నిఖిల్‌. 

Updated : 18 Dec 2022 07:40 IST

‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే చిత్రం ‘18పేజెస్‌’ (18 Pages). ఇది మీకు షాకిస్తుంది. సర్‌ప్రైజ్‌ చేస్తుంది’’ అన్నారు కథానాయకుడు నిఖిల్‌ (Nikhil). ఆయన.. అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రమే ‘18పేజెస్‌’. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా ఎంత విభిన్నంగా ఉంటుందన్నది ట్రైలర్‌ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. దీంట్లో మేము ఎక్కువగా ఏదీ బయట పెట్టలేదు. సినిమాలో చాలా సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. సుకుమార్‌ కథలో నేను హీరోగా నటించినందుకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమాని చాలా సరదా సరదాగా చేశాం. ఈ చిత్ర విషయంలో మమ్మల్ని వెనకుండి నడిపించిన నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌లకు కృతజ్ఞతలు. ఇది చాలా విభిన్నమైన సినిమా. సుకుమార్‌ మంచి కథ ఇచ్చారు. కచ్చితంగా అందరూ ఈ చిత్రంతో ప్రేమలో పడతారు’’ అన్నారు దర్శకుడు సూర్యప్రతాప్‌. నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఇది చాలా విచిత్రమైన ప్రేమకథ. దీంట్లో చాలా ప్రత్యేకతలున్నాయి. దీంట్లో నిఖిల్‌ హీరో మాత్రమే కాదు. ప్రతి విభాగాన్ని తనది అనుకొని.. ఎంతో ప్రేమగా ఈ సినిమా చేశాడు’’ అన్నారు. ‘‘చిత్ర బృందమంతా రెండేళ్ల పాటు కష్టపడి ఈ చిత్రాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో మాకెంతో అండగా నిలిచిన నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్‌. ఈ కార్యక్రమంలో ఎ.వసంత్‌, సరయు, అశోక్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని