2018 Movie: మలయాళ చిత్ర పరిశ్రమలో ఆ రికార్డు సృష్టించిన ఏకైక చిత్రం

‘2018’.. మలయాళ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. 10 రోజుల్లో రూ.100 కోట్లు.. కలెక్ట్‌ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించింది.

Updated : 22 May 2023 15:50 IST

హైదరాబాద్: ‘2018’.. ఈ మలయాళ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. 10 రోజుల్లో రూ.100 కోట్లు.. కలెక్ట్‌ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.137 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు సినీ ట్రేడింగ్‌ వర్గాల అంచనా. ఇప్పటివరకూ ఈ రికార్డు మోహన్‌లాల్‌ నటించిన పులి మురుగన్‌(మన్నెంపులి) పేరిట ఉండేది.  ‘2018’రికార్డుల వేట ఇప్పట్లో ఆగే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే మే 26వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మలయాళ ప్రేక్షకులు ఆదరించినట్టే ఇతర భాషల వారు అక్కున చేర్చుకుంటే రూ.200 కోట్లు దాటడం ఖాయం.

జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. నాటి ఘోర విపత్తు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారు? అనే కథాంశాన్ని తీసుకుని భావోద్వేగ భరితంగా ఆంథోని ఈ మూవీని తెరకెక్కించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని