2018 Movie: ‘2018’కి ఊహించని స్థాయి ఆదరణ’
టోవినో థామస్, ఇంద్రన్స్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. జూడ్ ఆంటోని తెరకెక్కించారు. బన్నీ వాసు నిర్మాత.
టోవినో థామస్ (Tovino Thomas), ఇంద్రన్స్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’ (2018 Movie). జూడ్ ఆంటోని తెరకెక్కించారు. బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘‘నేను 13ఏళ్ల క్రితం కాలేజ్ ట్రిప్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీ చూసేందుకు హైదరాబాద్ వచ్చాను. అయితే నా సినిమా ప్రమోషన్స్ కోసం ఇక్కడికి రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని ఊహించని స్థాయిలో ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా కష్టాన్ని ప్రశంసిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా తర్వాతి చిత్రాలు కూడా కచ్చితంగా తెలుగులో డబ్ అయ్యేలా చూస్తాను’’ అన్నారు. ‘‘2018 వరదల సమయంలో నిర్మాత బన్నీ వాసు కేరళ ప్రభుత్వానికి రూ.63లక్షలు ఆర్థిక సహాయం చేశారు. యాదృచ్చికంగా ఆయన ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. దీన్ని అందరూ తప్పక థియేటర్లలో చూడండి’’ అన్నారు దర్శకుడు జూడ్ ఆంటోని. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘పబ్లిసిటీకి పెద్దగా సమయం లేకున్నా ఇందులోని కథ ప్రేక్షకుల్ని కదిలిస్తుందన్న నమ్మకంతో థియేటర్లలోకి తీసుకొచ్చాం. ఆ నమ్మకం నిజమైంది’’ అన్నారు. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది’’ అంది నాయిక అపర్ణ బాలమురళి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ నిలిపివేత
-
LGM: ధోనీ సతీమణి నిర్మించిన ‘ఎల్జీఎం’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
skanda movie review: రివ్యూ స్కంద.. రామ్-బోయపాటి కాంబినేషన్ మెప్పించిందా?
-
MS Swaminathan: ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
-
ODI WC 2023: ప్రపంచకప్ స్క్వాడ్ ఫైనలయ్యేది నేడే.. ఆ ఒక్కరు ఎవరు?
-
EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..