Indian Films: టాప్-100 మూవీల జాబితాలో ‘RRR’ సహా నాలుగు భారతీయ చిత్రాలు..!
సినిమాలపై సమీక్షలను వెలువరించే ప్రముఖ వెబ్‌సైట్ ‘రోటెన్ టొమాటోస్’ తన డేటాబేస్‌లోని చిత్రాలను క్రోడీకరించి మూడు గంటలు అంతకన్నా ఎక్కువ నిడివి కలిగిన టాప్-100 చిత్రాల జాబితాలను విడుదల చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు సినిమా ‘RRR’ మరో రికార్డును అందుకుంది. ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ramcharan) కథానాయకులుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 95వ ఆస్కార్ పురస్కారాల నామినేషన్స్ జాబితాలోనూ నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాలపై సమీక్షలను వెలువరించే ప్రముఖ వెబ్‌సైట్ ‘రోటెన్ టొమాటోస్’ (Rotten Tomatoes) తాజాగా విడుదల చేసిన ఉత్తమ 100 చిత్రాల జాబితాలోనూ చోటు సంపాదించుకుంది. మూడు గంటలు అంతకన్నా ఎక్కువ నిడివి ఉన్న అత్యుత్తమ చిత్రాలను క్రోడీకరించి ‘రోటెన్ టొమాటోస్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో 1954లో వచ్చిన అడ్వెంచర్ మూవీ ‘సెవెన్ సమురాయ్’ టాప్-1లో నిలిచింది. వీటిలో పాటు, ‘షిండ్లర్స్ లిస్ట్’(5), ‘ది గాడ్‌ఫాదర్2’(8), లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ కింగ్ (23), ‘అపోకలిప్సి నౌ’ (24) వంటి ఆసక్తికర చిత్రాలున్నాయి.
ఇక మూడు గంటలు అంతకన్నా ఎక్కువ నిడివి కలిగిన నాలుగు భారతీయ (నేపథ్యం) చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ 12వ స్థానంలో నిలిచింది. ఆమిర్‌ఖాన్-అషుతోష్ గోవారికర్ ‘లగాన్’ (Lagaan) (13), రిచర్డ్ అటెన్‌బర్గ్ ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘గాంధీ’ (Gandhi) (32), అనురాగ్ కశ్యప్ యాక్షన్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపుర్ (Gangs of Wasseypur) (70) ఈ జాబితాలో ఉన్నాయి.
ఇక టాప్-10 చిత్రాల జాబితా విషయానికొస్తే, ‘సెవెన్ సమురాయ్’ (1954), మేడ్ ఇన్ అమెరికా(2006), ఉడ్‌ల్యాండ్స్ డార్క్ అండ్ డేస్ బివిచ్డ్: ఏ హిస్టరీ ఆఫ్ ఫోక్ హారర్ (2021), ఫ్యాన్నీ అండ్ అలెగ్జాండర్ (1982), సిండ్లర్స్ లిస్ట్ (1993), ది లెపార్డ్ (1963), చిల్డ్రన్ ఆఫ్ పారడైజ్ (1945), ది గాడ్ ఫాదర్‌పార్ట్-2 (1974), ది రైట్ స్టఫ్ (1983), ది లాస్ట్ ఆఫ్ ది అన్‌జస్ట్ (2013) చిత్రాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది: లోకేశ్
-
Sports News
IPL Final: అహ్మదాబాద్‌లో వర్షం.. మ్యాచ్ నిర్వహణపై రూల్స్ ఏం చెబుతున్నాయి?
-
India News
Manipur: మణిపుర్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది తిరుగుబాటుదారుల హతం
-
Sports News
Ambati Rayudu: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు
-
India News
Rahul Gandhi: రాహుల్‌కు కొత్త పాస్‌పోర్టు జారీ.. అమెరికా పర్యటనకు సిద్ధం
-
Sports News
Gill - Prithvi: తానొక స్టార్ అని భావిస్తాడు.. పృథ్వీ షాపై గిల్ చిన్ననాటి కోచ్ వ్యాఖ్యలు