RRR: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ 50రోజుల్లో మన ముందుకు రాబోతుంది

Updated : 30 Jul 2022 14:34 IST

నాలుగేళ్ల క్రితం..  సరిగ్గా ఇదే రోజున చెర్రీ, జక్కన, తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చర్చలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ (RRR) చిత్రం విడుదల కౌంట్‌ డౌన్‌ మొదలైంది. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్న ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరో 50 రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం. ‘‘ నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున తొలిసారి ఈ మూవీకి సంబంధించి చెర్రీ, జక్కన్న, తారక్‌ ముగ్గురు చర్చలు జరిపారు. మూడేళ్ల క్రితం సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. కరోనా కష్టకాలాన్ని దీటుగా ఎదుర్కొని చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. మరో 50రోజుల్లో బిగ్‌ స్క్రీన్‌పై మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురూ.. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం. 2022 జనవరి7న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలవుతుంది. ఆరోజున థియేటర్లలో సందడి కానుంది’ అని పేర్కొంది . 2017లో రాజమౌళి ట్వీట్‌ చేసిన ఫొటోను .. నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రీట్వీట్‌ చేసి ఆ ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని