Godfather: ‘గాడ్‌ఫాదర్’కు సూపర్ రెస్పాన్స్.. అక్కడ 600+ స్క్రీన్లు పెంపు!
‘గాడ్‌ఫాదర్’ (Godfather)తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి (Chiranjeevi). ప్రేక్షకుల నుంచి వస్తోన్న సూపర్ రెస్పాన్స్‌న చూసి చిత్రబృందం హిందీలో స్క్రీన్ల సంఖ్యను పెంచుతోంది.
హైదరాబాద్: ‘గాడ్‌ఫాదర్’ (Godfather)తో ఈ దసరాకు మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలోనూ మంచి టాక్‌తో నడుస్తోంది. బాలీవుడ్‌లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న సూపర్ రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం మరో అడుగు వేసింది. ‘గాడ్‌ఫాదర్’ హిందీ వెర్షన్‌కు శనివారం నుంచి మరో 600 స్క్రీన్స్ పెంచినట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో షేర్ చేశారు.
పాన్ ఇండియా సినిమా చేసేశారు
‘‘గాడ్‌ఫాదర్’పై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. విడుదలైన రెండు రోజుల్లో మా చిత్రం రూ.69 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినందుకు ఆనందిస్తున్నా. హిందీ బెల్ట్‌లో మరో 600 స్క్రీన్స్ పెంచుతున్నాం. మా చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చేసినందుకు ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు’’ అని చిరు పేర్కొన్నారు.
ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ చిరు మరో వీడియో ఇన్‌స్టాలో షేర్ చేశారు. మలయాళీ సూపర్‌హిట్ ‘లూసిఫర్’కు రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ తెరకెక్కింది. మోహన్‌రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. మాతృకతో సంబంధం లేకుండా తెలుగు వారికి చేరువయ్యేలా మార్పులు చేసి దర్శకుడు మోహన్‌రాజా ‘గాడ్‌ఫాదర్’ తెరకెక్కించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ఐటీ అధికారుల ముసుగులో గోల్డ్ షాప్‌లో లూటీ.. దర్యాప్తులో కీలక విషయాలు
-
Movies News
BIG B: ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ.. తనను తాను నిందించుకున్న అమితాబ్
-
Politics News
Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్ గాంధీ!
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
-
General News
Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి