Published : 16 May 2022 13:23 IST

777 Charlie: మనసుని హత్తుకునేలా ‘777 చార్లి’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘‘ప్రతి కుక్కకి ఒక రోజు వస్తది. ఈరోజు చార్లిది’’ అని అంటున్నారు కన్నడ నటుడు రక్షిత్ శెట్టి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘777 చార్లి’. కిరణ్‌ రాజ్‌ దర్శకుడు. మూగజీవాలు ముఖ్యంగా శునకాల విషయంలో కొంతమంది చూపిస్తున్న చిన్నచూపు, శునకాలకు వాటి యజమానులతో ఉండే అనుబంధాన్ని చూపించే ఫీల్‌గుడ్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్‌ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ‘777 చార్లి’ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘నా పేరు ధర్మ. నా వరకూ నేను కరెక్ట్‌. చూసేవాళ్ల దృష్టిలో నేను రాంగ్‌. ఇల్లు, ఫ్యాక్టరీ, గొడవ, ఇడ్లీ, సిగరెట్‌, బీర్‌.. ఇంతే నా జీవితం. ఇంతకు మించి ఆసక్తిగా ఏమీ లేనేలేదు’’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. చార్లి అనే శునకం హీరో దగ్గరకి రావడం, దాన్ని వదిలించుకోవడానికి హీరో ఎన్నో ప్రయత్నాలు చేయడం.. కొన్ని సంఘటనల తర్వాత హీరోకి-శునకానికి మధ్య మంచి అనుబంధం ఏర్పడటం.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలతో ఈచిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్‌ చివర్లో హీరో.. ‘‘చార్లి నేనంటే నీకెంత ఇష్టం’’ అని శునకాన్ని ప్రశ్నించగా.. అది పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోని హత్తుకోవడం ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని