9 HOURS: 9గంటల సమయంలో ఏం జరిగింది?

‘మర్చిపోకండి మళ్లీ హాజరు సమయానికి, మీకూ మధ్య 9గంటలు మాత్రమే’ అంటూ ఆసక్తిని కలిగిస్తోంది

Published : 14 May 2022 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మర్చిపోకండి మళ్లీ హాజరు సమయానికి, మీకూ మధ్య 9గంటలు మాత్రమే’ అంటూ ఆసక్తిని కలిగిస్తోంది ‘9 అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌ బృందం.  ప్రముఖ దర్శకుడు క్రిష్‌ అందించిన కథతో తెరకెక్కుతున్న ఆసక్తికర వెబ్‌ సిరీస్‌ ఇది. అజయ్‌, మధుశాలిని, తారక రత్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ జూన్‌2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు.  ‘డెక్కన్‌ ఇంపీరియల్‌ బ్యాంకు’లో 9గంటల పాటు ఏం జరిగిందన్న ఆసక్తికర కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు నిరంజన్‌ కౌశిక్‌, జాకబ్‌ వర్గీస్‌లు దర్శకత్వం వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని